Shiva Nirvana: శివ నిర్వాణ..టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న అతికొద్దిమంది క్లాస్ చిత్రాలను రూపొందించే దర్శకులలో ఇతను కూడా ఒకడు. లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్‌తోనే ఇప్పటి వరకూ శివ నిర్వాణ చిత్రాలను రూపొందించాడు. అయితే, చేసిన నాలుగు సినిమాలలో మొదటి రెండు చిత్రాలు సూపర్ హిట్ సాధించాయి. ఆ తర్వాత చేసిన రెండు సినిమాలు ఫ్లాప్‌గా మిగిలాయి.
'ఇరుముడి' మీదే శివ నిర్వాణ హోప్స్ అన్నీ:
మాస్ మహారాజ్ రవితేజతో దర్శకుడు శివ నిర్వాణ రూపొందిస్తున్న సినిమా 'ఇరుముడి'. థ్రిల్లర్, భక్తి ప్రధానాంశాలతో ఈ సినిమా తెరకెక్కించాడు. గతంలో, ఈ దర్శకుడి నుంచి వచ్చిన చిత్రాలు ప్రేమ-ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌గా వచ్చాయి. కానీ, 'ఇరుముడి' సినిమాలో తండ్రీకూతురు మధ్య సాగే ఎమోషనల్ డ్రామా. అంతేకాదు, మద్యానికి అలవాటు పడిన పాత్ర, ఆ తర్వాత అయ్యప్ప దీక్షలో ఉన్నప్పుడు ఎదురైన సవాళ్ళు ఏంటీ? ఈ అంశాలతో 'ఇరుముడి' రాబోతోంది.
ఇద్దరికీ కీలకం:
'ఇరుముడి' దర్శకుడిగా శివ నిర్వాణకి ఎంత కీలకమో, హీరోగా రవి తేజకి అంతే కీలకం. ప్రియ భవానీ శంకర్ కి ఈ సినిమా హిట్ ఐతే ఖచ్చితంగా తెలుగులో మరిన్ని అవకాశాలు క్యూ కడతాయి. ఇప్పటికే, సాంగ్స్ అన్నీ సూపర్ హిట్ అయి, సినిమాపై పాజిటివ్ బక్ క్రియేట్ అయింది. ఇప్పటి వరకూ చేసిన సినిమాల కంటే ఇది రవి తేజ కెరీర్‌లో ఓ ప్రత్యేకమైన చిత్రం.
రెండు హిట్లు-రెండు ఫ్లాపులు:
శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన మొదటి సినిమా నిన్ను కోరి. నాని, నివేదా థామస్, ఆది పినిశెట్టి నటించారు. ఈ సినిమా మంచి హిట్ సినిమాగా నిలిచింది. 50 కోట్లకి పైగా వసూలు చేసింది నిన్ను కోరి. ఆ తర్వాత సమంత, నాగ చైతన్య, దివ్యాంశ కౌశిక్ ప్రధాన పాత్రల్లో మజిలీ వచ్చింది. ఈ సినిమా 70 కోట్లకి పైగా వసూళ్ళు రాబట్టి అందరికీ మంచి లాభాలను తెచ్చిపెట్టింది. కానీ, విజయ్ దేవరకొండ-సమంతలతో చేసిన ఖుషి, నానితో చేసిన టక్ జగదీష్ బాగా డిసప్పాయింట్ చేశాయి. మళ్ళీ, ఇప్పుడు ఇరుముడి సినిమాతో వస్తున్నాడు. మరి, ఈ సినిమా ఫలితం ఎలా ఉండబోతుందో చూడాలి.


