సినిమా

సినీ నటి అనసూయపై కేసు నమోదు.. బోరబండ పీఎస్‌లో బీజేపీ నేతల ఫిర్యాదు!

రచన: Mamatha puppala••4 నిమిషాల పఠనం

ప్రముఖ సినీ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో, సోషల్ మీడియాలో తీవ్ర కలకలం రేపాయి. సనాతన ధర్మం, ‘జై శ్రీరామ్’ నినాదాన్ని అడ్డుపెట్టుకుని కొందరు అసాంఘిక దాడులు, అభ్యంతరకర వ్యాఖ్యలకు పాల్పడుతున్నారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారమే రేగింది.

ప్రముఖ సినీ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో, సోషల్ మీడియాలో తీవ్ర కలకలం రేపాయి. సనాతన ధర్మం, ‘జై శ్రీరామ్’ నినాదాన్ని అడ్డుపెట్టుకుని కొందరు అసాంఘిక దాడులు, అభ్యంతరకర వ్యాఖ్యలకు పాల్పడుతున్నారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారమే రేగింది. ఈ వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఆరోపిస్తూ హైదరాబాద్‌లోని బోరబండ పోలీస్ స్టేషన్‌లో బీజేపీ నాయకులు ఫిర్యాదు చేశారు.

వారి ఫిర్యాదు ఆధారంగా బోరబండ పోలీసులు అనసూయపై కేసు నమోదు చేశారు. హిందూ ధర్మాన్ని కించపరిచేలా మాట్లాడిన అనసూయపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. సామాజిక మాధ్యమాల్లో బాధ్యతాయుతంగా మాట్లాడాలని ఆమెకు హెచ్చరికలు జారీ చేశారు. మతవిశ్వాసాలను, దేవుళ్ల నినాదాలను వివాదాల్లోకి గురిచేయడం ఏమాత్రం తగదని స్పష్టం చేశారు.

అయితే తనపై కేసు నమోదు కావడం, వస్తున్న విమర్శలపై అనసూయ అంతే ఘాటుగా స్పందించారు. తాను చేసిన వ్యాఖ్యలకు పూర్తిగా కట్టుబడి ఉన్నానని, కేవలం నినాదాలు చేయడం వల్ల ఉపయోగం లేదని, మనుషుల ప్రవర్తన, నైతికత ముఖ్యమనే ఉద్దేశంతోనే మాట్లాడానని స్పష్టం చేశారు. తాను రామ భక్తురాలినని, సనాతన ధర్మాన్ని నిరంతరం గౌరవిస్తానని తెలుపుతూనే, తన పోరాటం వల్ల అసలైన దొంగలంతా బయటకు వస్తున్నారంటూ విమర్శకులకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

కాగా, సోషల్ మీడియాలో సెలబ్రిటీల వ్యాఖ్యలు తరచూ వివాదాలకు కారణమవుతున్న నేపథ్యంలో ఈ ఘటన మళ్లీ చర్చనీయాంశంగా మారింది. బాధ్యతాయుతమైన పదవుల్లో లేదా ప్రజాదరణ పొందిన స్థానాల్లో ఉన్నవారు మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని వ్యవహరించాలని, భావప్రకటనా స్వేచ్ఛ పేరుతో ఇతరుల మత విశ్వాసాలను గాయపరచడం తగదని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, ఈ కేసు తదుపరి విచారణపై పోలీసులు స్పందిస్తూ.. వచ్చిన ఫిర్యాదు ప్రాథమిక అంశాల ఆధారంగా చట్టప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

 

#nasuya Bharadwaj#Borabanda Police Station#BJP Complaint#Sanatana Dharma Controversy#Jai Shri Ram Slogan#Anasuya Police Case#Tollywood Latest News 2026#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి