Naga Chaitanya: టాలీవుడ్‌లో మిగతా హీరోలతో పోల్చి చూసుకుంటే అక్కినేని నాగ చైతన్య కాస్త డిఫరెంట్ సినిమాలను ఎంచుకుంటున్నాడు. అంతేకాదు, ఒక్కో కథను చాలా సెలెక్టెడ్‌గా ఎంచుకుంటున్నాడు. గత చిత్రం తండేల్ భారీ విజయాన్ని అందుకుంది. కానీ, ఈ సినిమా తర్వాత మళ్ళీ కొత్త సినిమాకి సంబందించిన అప్‌డేట్స్ మాత్రం దాదాపు ఆరు నెలల నుంచి రావడం లేదు.
నాగ చైతన్య నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'వృష కర్మ'. ఈ సినిమా మొదలైనప్పుడు..పోస్టర్స్ వచ్చినప్పుడు అంచనాలు మొదలయ్యాయి. కానీ, మేకర్స్ ప్రాపర్‌గా అప్‌డేట్స్ ఇవ్వకపోవడం..రిలీజ్ విషయంలో సస్పెన్స్ నెలకొనడంతో అక్కినేని అభిమానులు చాలా డిసప్పాయింట్ అవుతున్నారు. దీని గురించి సోషల్ మీడియాలో కూడా వార్తలు వస్తున్నాయి.
ఇటీవల అక్కినేని అఖిల్ నటించిన లెనిన్ సినిమా వచ్చి 100 కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ తర్వాత వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు మూవీతో వచ్చి సాలీడ్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత రవితేజ ఇరుముడి సినిమాతో వచ్చి 200 కోట్లకి పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి..ఇంకా బాక్సాఫీస్ వద్ద దుమారం రేపుతున్నాడు. ఇక, ఈ నెలలో నానీ ప్యారడైజ్ సినిమాతో రాబోతున్నాడు. నాగార్జున, బాలయ్య సినిమాలు డిసెంబర్ 24న రిలీజ్ కాబోతున్నాయి.
అంతేకాదు, ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ డిసెంబర్ 3న రిలీజ్ కాబోతోంది. తాజాగా, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తున్న సినిమాను డిసెంబర్ 4న రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు. దాంతో, ఇప్పుడు టాపిక్ నాగ చైతన్య మీదకి వెళ్ళింది. ఆయన నటిస్తున్న వృష కర్మ వాస్తవానికి దసరా బరిలో నిలవాల్సి ఉంది. కానీ, అసలు సౌండే లేకపోవడంతో..ఈ రేసు నుంచి తప్పుకుందని అర్థమవుతోంది. డిసెంబర్ మొత్తం ప్యాక్ అయింది. దీన్నిబట్టి చూస్తే చైతూకి బాక్సాఫీస్ వద్ద ఈ ఏడాది గ్యాప్ దొరకనట్టే. మరి, మేకర్స్ ఈ సినిమా అప్‌డేట్స్ ఎప్పుడిస్తారో.












