Keerthy Suresh: ది ప్యారడైజ్..నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ సినిమా. ఈ నెల 24న 7 భాషలలో రిలీజ్ కాబోతోంది. హీరోయిన్‌గా కయాదు లోహర్ నటించింది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. ఇటీవల ఈ సినిమా నుంచి వచ్చిన ఏషనాగుల సాంగ్ యూట్యూబ్ లో సెన్షేషన్ ని క్రియేట్ చేసింది. ఆ ప్రభావమే, ఇప్పుడు కీర్తి కూడా 'ది ప్యారడైజ్. సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతోందని వార్త వైరల్ అవుతోంది.
దసరా తర్వాత దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, నాని కాంబినేషన్‌లో వస్తోన్న ది ప్యారడైజ్ సినిమాపై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు విలన్ పాత్రలో నటిస్తున్నాడు. అలాగే, ఓ సరికొత్త పాత్రలో సంపూర్ణేష్ బాబు కనిపించబోతున్నాడు. ఈ రెండు పాత్రలు సినిమాకి హైలెట్‌గా నిలవనున్నాయి. వీటితో పాటు మరో పాత్ర కూడా సినిమాకి హైలెట్ అయ్యేలా దర్శకుడు ప్లాన్ చేశాడట.
ఆ పాత్ర మరేదో కాదు..ఇటీవల రిలీజైన యేషనాగుల పాటలో నానితో కలిసి ఊర మాస్ స్టెప్పులేసిన కీర్తి సురేష్‌దట. ఇదే, వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది. కానీ, మేకర్స్ నుంచి అందుతున్న సమాచారం మేరకు..ఇది కంప్లీట్‌గా రూమర్ అని తెలుస్తోంది. కేవలం 4 నిముషాల పాటలో మాత్రమే కీర్తి కనిపించనుంది. అంతేతప్ప, కీలక పాత్రలో మాత్రం తాను కనిపించడం లేదు. మేయిన్ హీరోయిన్ ఒక్కరే..అది కయాదు లోహర్ మాత్రమే.
అందుకే, కీర్తి విషయంలో రూమర్స్ వచ్చాయా?
దసరా సినిమాలో నాని సరసన నటించిన కీర్తి సురేష్ అంతకముందు 'నేను లోకల్' మూవీ కోసం ఇద్దరు కలిశారు. ఇలా, రెండు బ్లాక్ బస్టర్స్‌లో నటించడం వల్లే..ప్యారడైజ్ లోనూ కనిపించబోతుందని వార్తలు పుట్టుకొచ్చాయి. అదీకాక, ఇంతకముందెప్పుడూ ఈ మహానటి స్పెషల్ నంబర్‌లో కనిపించలేదు. యేషనాగుల లో కీర్తి కాస్ట్యూంస్ అసలు ఐటం సాంగ్‌లా అనిపించలేదు. ఇవన్నీ చూసే..ముఖ్యమైన పాత్రలో కనిపించనుందనే రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. ఏదేమైనా, ప్యారడైజ్ సినిమాపై మాత్రం ప్రతీ ఒక్కరిలో భారీ అంచనాలున్న మాట వాస్తవం.












