వ్యాపారం

National: వినియోగదారులకు షాకిచ్చిన మారుతీ సుజుకీ.. పెరిగిన కార్ల ధరలు!..

రచన: Venu3 నిమిషాల పఠనం

ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ తన వినియోగదారులకు షాక్ ఇచ్చింది.. ఇప్పటికే పెరుగుతున్న ఖర్చులతో సతమతమవుతున్న వినియోగదారులపై ఇప్పుడు కొత్త భారం పడనుంది. దేశంలో ప్రముఖ కార్ల తయారీ సంస్థగా ఉన్న మారుతీ సుజుకీ.. తనకు చెందిన కొన్ని మోడళ్ల ధరలను మరోసారి పెంచుతున్నట్లు ప్రకటించింది.

ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ తన వినియోగదారులకు షాక్ ఇచ్చింది.. ఇప్పటికే పెరుగుతున్న ఖర్చులతో సతమతమవుతున్న వినియోగదారులపై ఇప్పుడు కొత్త భారం పడనుంది. దేశంలో ప్రముఖ కార్ల తయారీ సంస్థగా ఉన్న మారుతీ సుజుకీ.. తనకు చెందిన కొన్ని మోడళ్ల ధరలను మరోసారి పెంచుతున్నట్లు ప్రకటించింది. ఎంపిక చేసిన వాహనాలపై గరిష్ఠంగా 20 వేల రూపాయల వరకు ధర పెంచుతున్నట్లు కంపెనీ వెల్లడించింది.

ఈ సవరించిన ధరలు సెప్టెంబర్ నెల నుంచే అమల్లోకి వచ్చినట్లు తెలిపింది. ధరల పెంపునకు సంబంధించి కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్ ద్వారా వివరాలను వెల్లడించింది. మరోవైపు గత కొంతకాలంగా ఉత్పత్తి వ్యయాన్ని అదుపులో ఉంచుతూ, కార్ల ధరలను వినియోగదారులకు అందుబాటులో ఉండేలా మారుతీ సుజుకీ ప్రయత్నాలు చేస్తోంది. అయితే ద్రవ్యోల్బణం పెరగడం, ముడి పదార్థాల ధరలు అధికం కావడం, ఇతర వ్యయాలు పెరగడంతో కంపెనీపై అదనపు భారం పడుతోందని తెలిపింది.

ఈ పరిస్థితుల్లో ధరలను పెంచడం తప్ప మరో మార్గం లేకపోయిందని కంపెనీ స్పష్టం చేసింది. అయితే మొత్తం భారాన్ని వినియోగదారులపై మోపకుండా.. సాధ్యమైనంత మేరకు ధరల పెంపు ప్రభావాన్ని తగ్గించేలా నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. ఇక ఈ ఏడాదిలో మారుతీ సుజుకీ కార్ల ధరలు పెరగడం ఇది మూడోసారి కావడం చర్చనీయాంశంగా మారింది.

మే నెల నుంచి వరుసగా ధరల సవరణలు చోటుచేసుకోవడంతో.. మారుతీ కార్లు కొనుగోలు చేయాలనుకునే వారికి బడ్జెట్ మరోసారి పెరగనుంది. ప్రస్తుతం మారుతీ సుజుకీ మార్కెట్లో ఎంట్రీ లెవల్ కార్ల నుంచి ప్రీమియం యుటిలిటీ వాహనాల వరకు విస్తృతమైన మోడళ్లను విక్రయిస్తోంది. ఎస్-ప్రెస్సో వంటి చిన్న కార్లతో పాటు.. ఇన్విక్టో వంటి ప్రీమియం మోడళ్లు కూడా కంపెనీ పోర్ట్‌ఫోలియోలో ఉన్నాయి.

#National#business#Maruti Suzuki#car price hikes#up-to-rs-20000#select-models
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి