తెలంగాణ

22ఏ నెపాన్ని అధికారులపైకి నెడతామంటే ఊరుకునేది లేదు-ఏలేటి మహేశ్వర్ రెడ్డి

రచన: NK3 నిమిషాల పఠనం

22ఏ నిషేధిత భూముల జాబితా వివాదంపై స్వయంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి క్షమాపణలు చెప్పారని తెలిపారు. 22ఏ నెపాన్ని అధికారులపై మోపుతామంటే ఊరుకునేది లేదన్నారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామని మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామన్నారు.

Alleti Maheshwar Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై అలా మాట్లాడటం సరికాదని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. మధు మాట్లాడిన భాషను బీజేపీ ఎమ్మెల్యేలమంతా ఖండిస్తున్నామన్నారు. అపోజిషన్ లీడర్ కేసీఆర్ కూడా క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తాతా మధు కావాలని అలా మాట్లాడారా? లేక ఎవరైనా మాట్లాడించారా? అనే అనుమానం వ్యక్తం చేశారు. స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన తాత మధును బర్తరఫ్ చేయాలని ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు.

అసెంబ్లీలో మాట్లాడిన ఏలేటి.. 22ఏ అంశాన్ని ప్రస్తావించారు. 22ఏ నిషేధిత భూముల జాబితా వివాదంపై స్వయంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి క్షమాపణలు చెప్పారని తెలిపారు. 22ఏ నెపాన్ని అధికారులపై మోపుతామంటే ఊరుకునేది లేదన్నారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామని మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామన్నారు. దీనిపై సమాధానం చెప్పకుండా ఏదేదో మాట్లాడుతున్నారని.. రేవంత్ సర్కార్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని ఏలేటి ఆరోపించారు. ధరణిపై ఫోరెన్సిక్ ఆడిట్ జరిగిందా? అని ప్రశ్నించిన ఆయన.. జరిగితే పబ్లిక్ డొమైన్ లో ఎందుకు పెట్టలేదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆ నివేదికలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

#Alleti Maheshwar Reddy#Bjp#Brs#Congress#Telangana Politics#Tata Madhu#22A#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి