సినిమా

#RanabaaliTeaser: రణబాలి టీజర్‌తో ఆ విషయం క్లారిటీ రానుందా?

రచన: Anshu4 నిమిషాల పఠనం

#RanabaaliTeaser: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న పీరియాడికల్ మూవీ రణబాలి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నాడు. అక్టోబర్ 16న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇటీవల, మేకర్స్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో టీజర్ రిలీజ్ చేయబోతున్నారు. సెప్టెంబర్ 9న రణబాలి టీజర్ వస్తుందని ఎక్స్ ద్వారా ప్రకటించారు.

వరుస ఫ్లాప్స్‌తో ఉన్న విజయ్‌కి "రణబాలి" హిట్ కీలకం:

లైగర్, ఖుషి, ఫ్యామిలీ స్టార్, కింగ్డం సినిమాలతో విజయ్ దేవరకొండకి వరుసగా ఫ్లాప్స్ ఎదురయ్యాయి. వీటిలో కాస్తో కూస్తో సమంత హీరోయిన్‌గా నటించిన ఖుషి పరవాలేదు. శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మరీ డిజాస్టర్ కాదు. అలా అని హిట్ గా చెప్పడానికి లేదు. ఇక, మిగతా సినిమాలను జనాలు గుర్తుంచుకోవడం కూడా కష్టమే.

ఇలాంటి, సమయంలో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్‌ను లైన్‌లో పెట్టి ఒకదానితో ఒకటి సమాంతరంగా కంప్లీట్ చేస్తున్నాడు. ముందుగా, రణబాలి రాబోతుంది. నిన్నా మొన్నటి వరకూ ఈ సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అవుతుంది..దసరాకి రావడం కష్టమే అనుకున్నారు. కానీ, అవన్నీ రూమర్స్ అని మైత్రీ వారు అఫీషియల్‌గా రిలీజ్ డేట్‌ని ప్రకటించి కన్‌ఫర్మేషన్ ఇచ్చారు.

ఇక, రిలీజ్ కి మేకర్స్ రెడీ అవుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ మీద కూడా దృష్టి పెట్టారు. దీనిలో భాగంగా రణబాలి టీజర్ రిలీజ్ చేయనున్నారు. ఇందులో, మేయిన్ కథ ఏంటీ అనేది రివీల్ చేసి ప్రేక్షకుల్లో అంచనాలు, ఆతృత పెంచడానికి ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక, విజయ్-రష్మిక పెళ్ళి తర్వాత కలిసి నటించిన సినిమా ఇది. అలాకూడా అంచనాలు బాగానే ఉన్నాయి. మరి, వరుస ఫ్లాప్స్‌తో ఉన్న విజయ్‌ని రణబాలి సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తుందా లేదా చూడాలి.

##RanabaaliTeaser#Vijay Devarakonda#Rashmika Mandanna#Rahul Sankrthyan
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి