కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతూనే ఉన్నాయి.మినిస్టర్ కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యల హీట్ అధికార కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు రేపుతూనే ఉన్నాయి. కూతురి వ్యాఖ్యల నేపథ్యంలో మంత్రి కొండాకు పీసీసీ క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇవ్వడంతో ఆమె నిన్న గాంధీభవన్‌కు వచ్చి క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరై వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ‘నా కూతురు చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం. దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు..నన్ను ఎలా బాధ్యులు చేస్తారని’ కొండా సురేఖ కమిటీ ఎదుట వివరణ ఇచ్చినట్టు తెలిసింది.
కాగా,ఇదే విషయపై పార్టీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందిస్తూ.. కొండా సురేఖ మంత్రి స్థాయిలో ఉన్నారు.ఆమె కూతురు చేసిన తప్పులకు ఆమె వివరణ ఇవ్వాల్సిందే అని పేర్కొనడం గమనార్హం.దీనికి తోడు పార్టీ అభ్యర్థుల ఎంపిక అంశం ఎవరికీ లేదని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. అభ్యర్థుల ఎంపిక అంశం ఎవరి చేతులో ఉండదని, పార్టీ హైకమాండ్, సీబ్ల్యూసీ చేతులో ఉంటుందని కుండబద్దలు కొట్టారు.
అయితే, మంత్రి కొండా సురేఖకు పార్టీ క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇవ్వడాన్ని కొండా సుస్మిత తప్పుబట్టారు. సీఎం రేవంత్ మీద చేసిన వ్యాఖ్యలు తన వ్యక్తిగతమని, తన తల్లిని ఈ విషయంలో ఎందుకు బాధ్యురాలిని చేస్తున్నారని ఆమె పార్టీ తీరును తప్పుబట్టారు. తాజాగా మరోసారి కొండా సుస్మిత సోషల్ మీడియాలో మరో వీడియోను పోస్టు చేస్తూ సీఎం రేవంత్, కాంగ్రెస్ పార్టీ మీద కీలక వ్యాఖ్యలు చేశారు.
‘నా టార్గెట్ సీఎం రేవంత్ రెడ్డి మాత్రమే.. కాంగ్రెస్ పార్టీ కాదు. రేవంత్ రెడ్డి, అతని సోదరులు అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించడానికి రేవంత్‌కు ఏ అధికారం ఉంది? నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నాను. సోనియా,రాహుల్, ప్రియాంకా గాంధీలు అంటే గౌరవం ఉంది. కాంగ్రెస్ పార్టీ అంటే కూడా అంతే గౌరవం ఉంది. మీనాక్షి నటరాజన్ మేడం అంటే కూడా చాలా గౌరవం.రేవంత్, అతని సోదరులు రాష్ట్రంలో పెద్దఎత్తున అవినీతికి పాల్పడుతున్నారు’ అని కొండా సుస్మిత మరోసారి సంచలన కామెంట్స్ చేయడం గమనార్హం. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఏవిధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.
https://x.com/pulsenewsbreak/status/2090658033013846150?s=20


