క్రీడలు

నెదర్లాండ్స్‌లో పానీపూరి ఆస్వాదించిన జాంటీ రోడ్స్.. దేశీ స్టైల్ రిప్లై వైరల్!

రచన: Mamatha puppala••4 నిమిషాల పఠనం

దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం, ప్రపంచ ప్రఖ్యాత ఫీల్డర్ జాంటీ రోడ్స్‌కు భారతదేశం అన్నా, ఇక్కడి సంస్కృతి, ఆహారపు అలవాట్లన్నా అమితమైన ఇష్టం. ఈ విషయాన్ని ఆయన ఇప్పటికే అనేక సందర్భాల్లో స్వయంగా వెల్లడించారు. తాజాగా నెదర్లాండ్స్‌లోని రోటర్‌డామ్‌ నగరంలో ఉన్న 'కోయిలా' అనే భారతీయ రెస్టారెంట్‌లో ఆయన పానీపూరిని ఎంతో ఇష్టంగా ఆస్వాదిస్తూ కనిపించారు. ఆ సమయంలో అక్కడ చోటుచేసుకున్న ఓ సరదా సంభాషణ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది.

రెస్టారెంట్‌లో జాంటీ రోడ్స్ పానీపూరి తింటుండగా, అక్కడే ఉన్న ఒక మహిళ 'పానీపూరి మరీ కారంగా ఉందా?' అని అడిగారు. దానికి ఆయన ఆశ్చర్యంగా చూస్తూ.. 'నన్నే అడుగుతున్నారా? నేను మీకంటే ఎక్కువ ఇండియన్‌ని' అంటూ నవ్వుతూ సమాధానమిచ్చారు. ఆయన ఇచ్చిన ఈ దేశీ స్టైల్ సమాధానానికి పక్కనే ఉన్న మరో భారతీయుడు సైతం ఏకీభవిస్తూ నవ్వేశారు.

అంతటితో ఆగకుండా పక్కనున్న వ్యక్తిని చూపిస్తూ రోడ్స్ మరింత చమత్కరించారు. 'అతను పూణెలో ఉంటాడు, అది నిజమైన ఇండియా కాదు.. నేను ముంబై, గోవాల్లో ఉంటాను, అసలైన ఇండియా అంటే అదే' అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. ఈ ఫన్నీ మూమెంట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో క్రికెట్ అభిమానులు, నెటిజన్లు ఆయన హాస్యచతురతను, భారత్‌పై ఆయనకున్న ప్రేమాభిమానాలను ప్రశంసిస్తున్నారు.

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ ఫీల్డింగ్ కోచ్‌గా సుదీర్ఘ కాలం పనిచేసిన జాంటీ రోడ్స్‌కు భారతదేశంతో ప్రత్యేకమైన బంధం ఉంది. భారతదేశంపై ఉన్న గౌరవంతో 2015లో ముంబైలో జన్మించిన తన కుమార్తెకు ‘ఇండియా జెన్నె రోడ్స్’ అని నామకరణం చేయగా, 2017లో కుమారుడు నాథన్ కూడా ఇక్కడే జన్మించారు. దేశీ రుచులను అమితంగా ఇష్టపడే రోడ్స్.. ఈ వీడియోతో మరోసారి భారతీయ అభిమానుల మనసులను గెలుచుకున్నారు.

#Jonty Rhodes Pani Puri Viral Video#Jonty Rhodes I Am More Indian Than You#Jonty Rhodes Rotterdam Koyla Restaurant#Jonty Rhodes Love For India#Cricket News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి