తెలంగాణ

Vijayawada: బెజవాడ దుర్గమ్మ భక్తులకు శుభవార్త!..

రచన: Venu•••4 నిమిషాల పఠనం

బెజవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానానికి పదేళ్ల తర్వాత ఎట్టకేలకు మహర్దశ పట్టింది. 2016లో కొండపై ఉన్న అన్నదాన భవనాలను కూల్చివేసినప్పటి నుంచి, భక్తులకు ఉచిత నిత్యాన్నదాన కార్యక్రమాన్ని కొండ దిగువన ఉన్న మహామండపంలోనే నిర్వహిస్తున్నారు.

బెజవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానానికి పదేళ్ల తర్వాత ఎట్టకేలకు మహర్దశ పట్టింది. 2016లో కొండపై ఉన్న అన్నదాన భవనాలను కూల్చివేసినప్పటి నుంచి, భక్తులకు ఉచిత నిత్యాన్నదాన కార్యక్రమాన్ని కొండ దిగువన ఉన్న మహామండపంలోనే నిర్వహిస్తున్నారు. కొండపైకి వచ్చే భక్తులు అన్నప్రసాదం కోసం కిందకు వెళ్లాల్సి రావడం వల్ల ఎంతో ఇబ్బంది పడేవారు. అలాగే, ఆలయ ప్రసాదాలను కూడా వేరే ప్రాంతంలో తయారుచేసి కొండపైకి తెచ్చి విక్రయించాల్సి వచ్చేది.

ఈ సమస్యలన్నింటికీ స్వస్తి పలుకుతూ, ఆలయ యాజమాన్యం ఆధ్వర్యంలోనే కొండపై నూతనంగా అన్నదాన మరియు ప్రసాద తయారీ భవనాలను నిర్మించారు. సొంత భవనాలు అందుబాటులోకి రావడంతో భక్తులకు మెరుగైన వసతులు, ప్రసాదాలు నేరుగా అందనున్నాయి. మరోవైపు సుమారు రూ. 52.50 కోట్లతో ఈ రెండు భవనాలను పూర్తి చేసి నేడు లాంఛనంగా ప్రారంభించేందుకు సన్నాహాలు ప్రారంభించారు.

ఇక అన్నదానం నిర్వహించే భవనానికి దాదాపు రూ. 26 కోట్లు, ప్రసాద భవనానికి రూ. 26.50 కోట్లు వెచ్చించారు. ప్రస్తుతం కొండ దిగువన కనకదుర్గా నగర్‌లో నిర్మించిన ఈ రెండు నూతన భవనాలు.. భక్తులు అమ్మవారి దర్శనం చేసుకుని కిందకు వచ్చే మార్గంలో ఉన్నాయి.. మరోవైపు ఆలయంలో జరిగే ప్రధాన వేడుకల సమయంతో పాటు.. దసరా ఉత్సవాల సమయాల్లో కూడా ఎన్ని లక్షల మంది భక్తులొచ్చినా వారందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్నదానం చేసేలా ఈ భవనాన్ని సిద్ధం చేశారు.

ఇక ఈ భవనంలో ఒకేసారి కనీసం 800 మంది భోజనం చేసేలా ఏర్పాట్లు చేశారు. ఇకపై ఆలయానికి వచ్చే భక్తులు ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదని ఆలయ అధికారులు అంటున్నారు. అలాగే ఆలయ అధికారులు అన్నదాన భవనానికి శ్రీకనకదుర్గ అన్నప్రసాద సదనం, ప్రసాదాల తయారీ భవనానికి శ్రీదుర్గాభవానీ మహాప్రసాద భవనం అనే పేర్లను అధికారికంగా నిర్ణయించారు.

కొత్త భవనం ప్రారంభించిన తర్వాత లోపలే వంట, ఆ పక్కనే భక్తులు కూర్చుని తినే గదులు ఉండబోతున్నాయి. ప్రసాదాల తయారీ భవనంలోనూ ఒక అంతస్తు తయారీ.. మరో అంతస్తులో ప్రసాదాలు సిద్ధం చేయడానికి వినియోగించనున్నారు. కనకదుర్గ అన్నప్రసాద సదనం రెండు అంతస్తుల్లో నిర్మిస్తే.. శ్రీ దుర్గాభవానీ మహాప్రసాద భవనాన్ని మూడు అంతస్తుల్లో నిర్మించారు. పదేళ్ల తర్వాత అమ్మవారి ఆలయానికి సంబంధించి శాశ్వత భవనాలు నిర్మించడం పట్ల భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

#Vijayawada#Indrakiladri#devotees#Good news#Bezawada Durgamma
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి