తెలంగాణ

TG : స్మార్ట్ మీటర్లు.. తెలంగాణ ప్రజల నెత్తిన మరో పిడుగు!

రచన: Kumar••4 నిమిషాల పఠనం

తెలంగాణ ప్రజల నెత్తిన మరో పిడుగు పడనుంది. రాష్ట్ర విద్యుత్ శాఖలో స్మార్ట్ కరెంట్ మీటర్లు అమర్చాలని కాంగ్రెస్ సర్కార్ భావిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే పలుమార్లు ఈ అంశం తెరమీదకు రాగా.. అమలలో ఆలస్యం జరుగుతోందని ప్రచారం జరుగుతోంది.

తెలంగాణ ప్రజల నెత్తిన మరో పిడుగు పడనుంది. రాష్ట్ర విద్యుత్ శాఖలో స్మార్ట్ కరెంట్ మీటర్లు అమర్చాలని కాంగ్రెస్ సర్కార్ భావిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే పలుమార్లు ఈ అంశం తెరమీదకు రాగా.. అమలులో ఆలస్యం జరుగుతోందని ప్రచారం జరుగుతోంది. సీఎంవో నుంచి విద్యుత్ శాఖకు ఆదేశాలు వెళ్లాలని కూడా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న పాత మీటర్ల స్థానంలో స్మార్ట్ మీటర్లు అమర్చాలని సర్కార్ సంకల్పించినట్టు తెలుస్తోంది.

అయితే, పాత మీటర్ల కంటే స్మార్ట్ మీటర్లు అమర్చుకోవాలంటే కాస్త ఎక్కువ ఖర్చు భరించాల్సి ఉంటుంది. మరి ఈ ఖర్చును ఎవరు భరిస్తారన్నదే ఇక్కడ మిలియన్ డాలర్ క్వశ్చన్. ఎందుకంటే సర్కారు వద్ద డబ్బులు లేవని పదే పదే చెబుతోంది. సమయం, సందర్బం దొరికినప్పుడల్లా సీఎం రేవంత్ రెడ్డి ఇదే అంశాన్ని ఊటంకిస్తున్నారు. స్మార్ట్ మీటర్లు అమర్చడం వలన రాష్ట్ర ఖజానాపై భారం తగ్గించుకోవాలని, ఆదాయం పెంచుకోవాలని రేవంత్ సర్కార్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. దశలవారీగా స్మార్ట్ మీటర్లను అమరుస్తారని టాక్ వినిపిస్తోంది.

ఇకపై కొత్తగా జారీ చేసే విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లే ఇస్తారని, దశలవారీగా పాత కనెక్షన్లకు కూడా అమలు చేయనున్నట్టు సమాచారం. విద్యుత్ సంస్థల మెడపై అప్పుల కత్తి వేలాడుతోంది. సంస్థలను సైతం లాభాల్లోకి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. నెమ్మదిగా కొత్త కనెక్షన్లతో ప్రారంభించి, దశలవారీగా పాత కనెక్షన్లకు కూడా స్మార్ట్ మీటర్లు అమర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.

ఒక్కసారి స్మార్ట్ మీటర్లు అమర్చాక ప్రతి నెలా 30/31వ తేదీల్లో అర్ధరాత్రి రీడింగ్ తీసి వినియోగదారుడికి అధికారులు బిల్లు పంపించనున్నట్టు తెలుస్తోంది.ఇక ప్రభుత్వ కార్యాలయాలకు మాత్రం తప్పనిసరిగా ప్రీపెయిడ్ మీటర్లు అమర్చాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. సాధారణ మీటర్ల కంటే స్మార్ట్ మీటర్లకే ఎక్కువ ఖర్చు అవుతుందని, ఈ భారమంతా వినియోగదారుల నుంచే రాబట్టాలని డిస్కం సంస్థలు ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. ప్రీపెయిడ్ మీటర్లు గృహ అవసరాలకు వినియోగించే అంశం మాత్రం ప్రస్తుతం పెండింగులో ఉన్నట్టు సమాచారం.

https://x.com/TeluguScribe/status/2090636907055353945?s=20

#smart current meters#telangana#very soon#congress#cm reventh reddy
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి