- అమెరికా నుంచి సీఎం రాకముందే ప్రక్షాళన ఉంటుందా?
- కొత్త సీపీగా స్టీఫెన్.. భగవత్ అంటూ లీకులు?
- హైడ్రాకు డీజీ స్థాయి అధికారి ఉండాలనే ప్రతిపాదన?
- ఇంటెలిజెన్స్ చీఫ్‌ను కూడా మార్చేస్తారా?
- పీఎంను కించపరిచిన కేసు నమోదుపై అధిష్టానం క్లీన్ అబ్జర్వేషన్
- పోలీసుల బదీలీలపై హాట్‌హాట్‌గా జరుగుతున్న చర్చపై స్వేచ్ఛ స్పెషల్ స్టోరీ
దేవేందర్ రెడ్డి చింతకుంట్ల
స్వేచ్ఛ న్యూస్ చైర్మన్
తెలంగాణ పోలీస్ శాఖలో బదిలీలు ఉంటాయని మరోసారి భారీగా చర్చ జరుగుతోంది. హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను మారుస్తారనే ప్రచారం ఊపందుకుంది. ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలో ఉండగానే జరిగే అవకాశాలు ఉన్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంటెలిజెన్స్ చీఫ్‌ను కూడా మార్చేస్తారని అంటున్నారు. ప్రజా ఉద్యమాలను, అందోళనకు కారణాలను అంచనా వేయడంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ సరిగ్గా పని చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు ఈ పోస్టుకు యాక్టివ్‌గా ఉండే ఆఫీసర్ రాబోతున్నారనే చర్చ జరుగుతోంది. కానీ, ఆయనను రేవంత్ రెడ్డి పూర్తిగా నమ్మే పరిస్థితి లేదని తెలుస్తోంది. కొన్ని పేర్లను స్వయంగా ఆలోచిస్తున్నట్లు సమాచారం.
సీపీగా ఎవరు?
హైదరాబాద్ సీపీగా మహేష్ భగవత్ పేరుతో పాటు స్టీఫెన్ రవీంద్ర వస్తారని గత కొద్ది రోజులుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కర్నాటకలో ఎంపీగా పోటీ చేసేందుకు సజ్జనార్ కుటుంబం రెడీ అవుతున్నట్లు సమాచారం. దీనికి తోడుగా ఉన్నతాధికారులకు సీపీకి కొంత గ్యాప్ ఎర్పడినట్లు కింది స్థాయి ఉద్యోగులు అనుకుంటున్నారు. దీంతో సీపీని మారిస్తే ఆ ప్లేస్‌లో స్టీఫెన్ లేదా మహేష్ భగవత్ వస్తారని అనుకుంటున్నారు. జాయింట్ సీపీని కూడా మార్చేసే అవకాశాలు లేకపోలేదు. అయితే, ఓ కీలకమైన కేసు విచారణ కూడా ఈ బదిలీలకు కారణమా అనే అనుమానాలు లేకపోలేదని ఆరోపణ.
హైడ్రాను స్టేట్ వైజ్ చేసేందుకు డీజీ పోస్ట్ క్రియేట్ చేస్తారా?
రేవంత్ సర్కార్ హై ప్రొఫైల్‌గా తీసుకున్న హైడ్రాను రాష్ట్ర మొత్తం తీసుకోచ్చేందుకు, కోర్టు ఆదేశాలతో రంగనాథ్ బదిలీకి అడ్డుకట్ట వేయాలంటే ఓ కీలక పోస్ట్‌ను క్రియేట్ చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు ఒక డీజీని నియమించేలా ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌కు రంగనాథ్‌ను కొనసాగించేందుకు డీజీ కింద వీరంతా పని చేస్తారు కాబట్టి పోస్ట్ కమిషనర్ స్థాయి మారుతుందనే ఆలోచనలు ఉన్నాయి. అయితే, ఇదంతా అసెంబ్లీ సమావేశాలు అయిపోయాక చేస్తారా? ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా ఉండేందుకు అమెరికా నుంచే స్పీడ్‌గా బదిలీలు అయిపోతాయా, ఉత్తర్వులు వచ్చేస్తాయా అనేది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.


