క్రైమ్

Sanjush: కారు ఢీకొని యువతి మృతి.. జనసేన ఎంపీ కొడుకుపై కేసు నమోదు

రచన: NK••3 నిమిషాల పఠనం

Sanjush: జనసేన రాజ్యసభ ఎంపీ లింగమనేని రమేశ్ కుమారుడు సంజూష్ పై కేసు నమోదైంది. ఈ నెల 16న హైదరాబాద్ ఇనార్బిట్ మాల్ వద్ద కారుతో యువతిని ఢీకొట్టాడు సంజూష్. ఈ ప్రమాదంలో యువతి చనిపోయింది. మృతురాలిని లైఫ్ స్టైల్ ఉద్యోగిని భారతిగా గుర్తించారు. రోడ్డు దాటుతున్న సమయంలో సంజూష్ కారు యువతిని ఢీకొట్టింది. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంజూష్ పై కేసు నమోదైంది.

Sanjush: జనసేన రాజ్యసభ ఎంపీ లింగమనేని రమేశ్ కుమారుడు సంజూష్ పై కేసు నమోదైంది. ఈ నెల 16న హైదరాబాద్ ఇనార్బిట్ మాల్ వద్ద తన లగ్జరీ స్పోర్ట్స్ కారుతో యువతిని ఢీకొట్టాడు సంజూష్. ఈ ప్రమాదంలో యువతి చనిపోయింది. మృతురాలిని లైఫ్ స్టైల్ ఉద్యోగిని భారతిగా గుర్తించారు. రోడ్డు దాటుతున్న సమయంలో సంజూష్ కారు యువతిని ఢీకొట్టింది. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంజూష్ పై కేసు నమోదైంది.

ఈ నెల 16న మధ్యాహ్నం సమయంలో ఇనార్బిట్ మాల్ సమీపంలో లైఫ్ స్టైల్ ఉద్యోగిని భారతి తన సహ ఉద్యోగితో కలిసి రోడ్డు దాటుతున్న సమయంలో ఒక్కసారిగా అత్యంత వేగంగా కారు దూసుకొచ్చింది. భారతిని బలంగా ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో రోడ్డుపై పడి ఉన్న భారతిని.. కారు డ్రైవ్ చేస్తున్న సంజూష్ వెంటనే అపోలో ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఆసుపత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది. యువతి చనిపోయింది.

మృతురాలు భారతి సహ ఉద్యోగి అశోక్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు సంజూష్ పై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. అయితే సంజూష్ అత్యంత వేగంగా, చాలా నిర్లక్ష్యంగా కారుని డ్రైవ్ చేయడం వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. భారతి, అశోక్ భోజనం కోసం బయటకు వచ్చారు. తిరిగి వెళ్తున్న సమయంలో ఈ దారుణం జరిగింది. అత్యంత నిర్లక్ష్యంగా కారు నడిపి యువతి ప్రాణం పోవడానికి కారణమైన సంజూష్ పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మాదాపూర్ పోలీసులు చెబుతున్నారు.

వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి