తెలంగాణ

Jupally Krishna Rao: నీరు వృథా చేయొద్దు, ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టాలి- మంత్రి జూపల్లి

రచన: NK••4 నిమిషాల పఠనం

Jupally Krishna Rao: ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టి సద్వినియోగపరుచుకోవాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన డీ-8 కెనాల్‌ పరిధిలోని కాల్వలను పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు బైక్‌పై తిరుగుతూ స్వయంగా పరిశీలించారు.

* డీ-8 కెనాల్‌ పరిధిలో పర్యటించిన మంత్రి జూపల్లి

* కాల్వలు, డిస్ట్రిబ్యూటరీలకు నీటి విడుదలపై ఆరా

* నీటిని వృథా చేయొద్దు

* కాలువలపై అధికారులు నిరంతరం పర్యవేక్షించాలి

Jupally Krishna Rao: ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టి సద్వినియోగపరుచుకోవాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన డీ-8 కెనాల్‌ పరిధిలోని కాల్వలను పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు బైక్‌పై తిరుగుతూ స్వయంగా పరిశీలించారు. తూడుకుర్తి దగ్గర ప్రధాన కాల్వ నుండి సాకర్‌పల్లి, ఏదుట్ల‌, గోపాలపేట, రేమ‌ద్దుల, సింగాయిపల్లి, తురకపల్లి, గోపులపురం కాల్వలను పరిశీలించి నీటి ప్రవాహం, కాల్వల పరిస్థితిని ప‌ర్య‌వేక్షించారు.

కాల్వలు, డిస్ట్రిబ్యూటరీలకు విడుదల చేస్తున్న నీరు, ఆయకట్టు పరిస్థితిపై సాగునీటిపారుదల శాఖ అధికారులను మంత్రి ఆరా తీశారు. ఆయకట్టు చివరి భూముల వరకు సాగునీరు చేరుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు.

ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో ప్రతి నీటి బొట్టునూ ఒడిసిపట్టుకోవాలని మంత్రి సూచించారు. నీటిని ఏమాత్రం వృథా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని స్పష్టం చేశారు. అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగిస్తూ అధిక విస్తీర్ణంలో పంటలకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

కాల్వలు, డిస్ట్రిబ్యూటరీలకు నీటి విడుదల, నీటి ప్రవాహం, ఆయకట్టు పరిస్థితిపై సాగునీటిపారుదల శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని మంత్రి ఆదేశించారు. నీరు వృథా కాకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవడంతో పాటు, ఆయకట్టు చివరి భూములకు సైతం సక్రమంగా నీరు అందేలా చూడాలని సూచించారు. మంత్రి వెంట వనపర్తి జిల్లా గ్రంథాలయ చైర్మన్ గోవర్ధన్, కోడేరు మాజీ ఎంపీపీ రామ్మోహన్ రావు, సాగునీటిపారుదల‌ శాఖ అధికారులు, తదిత‌రులు ఉన్నారు.

Jupally Krishna Rao: నీరు వృథా చేయొద్దు, ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టాలి- మంత్రి జూపల్లి

#Jupally Krishna Rao#Water#Save Water#Elnino#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి