క్రైమ్

Case On Sumanth: మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీపై హత్యాయత్నం కేసు.. రూ.10కోట్లు ఇవ్వాలని బెదిరింపులు

రచన: NK••4 నిమిషాల పఠనం

Case On Sumanth: దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ నార్ల సుమంత్ గూండాగిరి బయటపడింది. సుమంత్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. సుమంత్ పై జూబ్లీహిల్స్ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. వ్యాపారి గొంగిడి హరికృష్ణను(36) 10 కోట్ల రూపాయలు ఇవ్వాలని సుమంత్ డిమాండ్ చేశాడని ఆరోపణలు వచ్చాయి. ఆ డబ్బులు ఇవ్వకపోవడంతో తనపై ఇనుప రాడ్లతో దాడి చేశారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఈ ఫిర్యాదు ఆధారంగా సుమంత్ మరో ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తొలుత మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో జీరో ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఆ తర్వాత ఈ కేసుని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. విచక్షణారహితంగా దాడి చేయడంతో పాటు తనను చిత్రహింసలు పెట్టారని బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

ఫిర్యాదులో పొందుపరిచిన వివరాలు..

బోడుప్పల్ కి చెందిన హరికృష్ణ మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. జూలై 30వ తేదీన సుమంత్ హరికృష్ణకు ఫోన్ చేసి వెంటనే కలవాలని చెప్పాడు. నేను ఇప్పుడే ఊరి నుంచి వచ్చాను, ఇప్పుడు కలవడం కుదరదు, పొద్దునే కలుస్తానని హరి చెప్పాడు.

Case On Sumanth: మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీపై హత్యాయత్నం కేసు.. రూ.10కోట్లు ఇవ్వాలని బెదిరింపులు

మరుసటి రోజు కలిసేందుకు వెళ్లగా సుమంత్ నన్ను బూతులు తిట్టాడు. చంపుతా అని బెదిరించాడు. అక్కడికి సుమంత్ స్నేహితులు కూడా వచ్చారు. అంతా కలిసి నన్ను దారుణంగా కొట్టారు. కర్రలు, ఇనుప రాడ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. నన్ను చంపేయాలని సుమంత్ తన స్నేహితులతో చెప్పాడు.

Case On Sumanth: మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీపై హత్యాయత్నం కేసు.. రూ.10కోట్లు ఇవ్వాలని బెదిరింపులు

ఈ దాడిలో నాకు తీవ్ర గాయాలయ్యాయి. చెయ్యి విరిగింది. గాంధీ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నా. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం మరో ఆసుపత్రిలో చేరాను. అక్కడ నాకు సర్జరీ జరిగింది'' అని బాధితుడు ఇచ్చిన ఫిర్యాదులో ఉంది. హరికృష్ణ ఫిర్యాదు ఆధారంగా సుమంత్ (A1), ప్రశాంత్ (A2), అరుణ్ కుమార్ రెడ్డి (A3), కార్తిక్ (A4), మహేందర్ రెడ్డి (A), రాము(A6)పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు.

Case On Sumanth: మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీపై హత్యాయత్నం కేసు.. రూ.10కోట్లు ఇవ్వాలని బెదిరింపులు

#Sumanth#Konda Surekha#Jubilee Hills Police Station#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి