International

cancer-vaccine: వైద్యరంగంలో మరో కీలక అడుగు.. క్యాన్సర్‌ వ్యాక్సిన్ ఫేజ్-3 ట్రయల్స్‌ సక్సెస్!..

రచన: Venu•••3 నిమిషాల పఠనం

క్యాన్సర్ మహమ్మారిపై పోరాటంలో వైద్యరంగంలో మరో కీలక అడుగుపడింది.. ప్రముఖ ఫార్మాదిగ్గజాలు మోడెర్నా, మెర్క్‌ సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఎమ్‌ఆర్ఎన్ఏ క్యాన్సర్ వ్యాక్సిన్ తుదిదశ క్లినికల్ ప్రయోగాల్లో ఆశించిన ఫలితాలు సాధించింది.

క్యాన్సర్ మహమ్మారిపై పోరాటంలో వైద్యరంగంలో మరో కీలక అడుగుపడింది.. ప్రముఖ ఫార్మాదిగ్గజాలు మోడెర్నా, మెర్క్‌ సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఎమ్‌ఆర్ఎన్ఏ క్యాన్సర్ వ్యాక్సిన్ తుదిదశ క్లినికల్ ప్రయోగాల్లో ఆశించిన ఫలితాలు సాధించింది.

అత్యంత ప్రమాదకరంగా భావించే చర్మ క్యాన్సర్ మెలనోమా రోగుల్లో శస్త్రచికిత్స అనంతరం క్యాన్సర్ మళ్లీ తిరగబెట్టకుండా, శరీరంలో ఇతర భాగాలకు వ్యాపించకుండా అడ్డుకోవడంలో ఈ వ్యాక్సిన్ విజయవంతమైనట్లు పరిశోధకులు ప్రకటించారు.

శస్త్రచికిత్స తర్వాత క్యాన్సర్ మళ్లీ రావడం, ఇతర అవయవాలకు వ్యాపించడం తగ్గించడమే ప్రధాన లక్ష్యంగా ఈ వ్యాక్సిన్ రూపొందిస్తున్నట్టు సమాచారం. ఇక ఈ వ్యాక్సిన్ ఫేజ్-3 ట్రయల్‌ 1,137 మంది హై-రిస్క్ మెలనోమా వ్యాధిగ్రస్తుల పై నిర్వహించినట్టు పరిశోధకులు వెల్లడించారు. ఇక క్యాన్సర్ మహమ్మారిపై మొదటి దశ మానవ క్లినికల్ ట్రయల్ 2017 ఆగస్టులో ప్రారంభమైంది.

అదేవిధంగా రెండో దశ.. ట్రయల్ 2019 జూలైలో ప్రారంభమైంది. 157 మంది హై-రిస్క్ మెలనోమా రోగులపై నిర్వహించిన ఈ అధ్యయనంలో క్యాన్సర్ తిరిగి వచ్చే ప్రమాదం, వ్యాపించే ప్రమాదం రెండూ గణనీయంగా తగ్గినట్లు తేలింది. ఇక తాజాగా ఫేజ్-3 ఫలితాలు రావడంతో ఈ వ్యాక్సిన్ పై ఆశలుపెరిగాయి. కానీ రెగ్యులేటరీ అనుమతులు ఇంకా రావాల్సి ఉంది.

మరోవైపు ప్రపంచవ్యాప్తంగా 2022లో దాదాపు 2 కోట్ల కొత్త క్యాన్సర్ కేసులు, 97 లక్షల మరణాలు నమోదయ్యాయి. 2024 నాటికి క్యాన్సర్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా దాదాపు కోటి మరణాలు సంభవించాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ప్రస్తుత పరిస్థితులు ఇలాగే కొనసాగితే 2050 నాటికి కొత్త కేసులు దాదాపు 3.5 కోట్లకు చేరే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

#International News#cancer-vaccine#phase-3 trials#medical#successful#MRNA
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి