తెలంగాణ

DK Aruna: రైల్వే అభివృద్ధి పనుల వేగం పెంచండి- ఎంపీ డీకే అరుణ

రచన: NK••6 నిమిషాల పఠనం

గురువారం సికింద్రాబాద్ రైల్ నిలయంలో తెలంగాణ పార్లమెంట్ సభ్యులతో రైల్వే ఉన్నతాధికారుల సమావేశం జరిగింది. మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలోని రైల్వే అభివృద్ధి పనుల పురోగతిపై ఎంపీ డీకే అరుణ అధికారులను అడిగి తెలుసుకున్నారు. గత సమావేశంలో ఇచ్చిన ప్రపోజల్స్ లో ఎన్ని మంజూరయ్యాయి, ఏ స్టేజ్ లో ఉన్నాయి అనే వివరాలు ఆరా తీశారు. వాటిని త్వరితగతిన ముందుకు తీసుకెళ్లేందుకు అధికారులు కృషి చేయాలని అన్నారు.

DK Aruna: గురువారం సికింద్రాబాద్ రైల్ నిలయంలో తెలంగాణ పార్లమెంట్ సభ్యులతో రైల్వే ఉన్నతాధికారుల సమావేశం జరిగింది. మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలోని రైల్వే అభివృద్ధి పనుల పురోగతిపై ఎంపీ డీకే అరుణ అధికారులను అడిగి తెలుసుకున్నారు. గత సమావేశంలో ఇచ్చిన ప్రపోజల్స్ లో ఎన్ని మంజూరయ్యాయి, ఏ స్టేజ్ లో ఉన్నాయి అనే వివరాలు ఆరా తీశారు. వాటిని త్వరితగతిన ముందుకు తీసుకెళ్లేందుకు అధికారులు కృషి చేయాలని అన్నారు. ఇప్పటివరకు సెంట్రల్ రైల్వే బోర్డుకు పంపిన ప్రతిపాదనలు ఏ స్టేజ్ లో ఉన్నాయని ఎంపీ డీకే అరుణ అధికారులను అడిగి తెలుసుకున్నారు.

* ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అమృత్ భారత్ స్టేషన్ షాద్ నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, గద్వాల జోగులాంబ స్టేషన్ లలో వందే భారత్ అమృత్ స్టేషన్ పథకంలో భాగంగా అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాల కల్పన పనులు సాగుతున్నాయి.

* జోగులాంబ గద్వాల స్టేషన్ లో పనులు పూర్తయ్యాయి. ప్రారంభానికి సిద్ధంగా ఉంది.

* వందే భారత్ అమృత్ స్టేషన్ పథకంలో భాగంగా షాద్ నగర్ - జడ్చర్ల స్టేషన్లు మార్చి 2027, మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ జూన్ 2027 నాటికి, గద్వాల రైల్వే స్టేషన్ ఏప్రిల్ 2027 నాటికి పూర్తి చేస్తామని సమీక్షలో వెల్లడించారు.

* మహబూబ్ నగర్ పట్టణంలో టీడీ గుట్ట ROB మంజూరు జరిగింది. భూసేకరణ పూర్తయిన వెంటనే, టెండర్లు పిలుస్తామని అధికారులు తెలిపారు.

* వీరన్నపేట, బోయపల్లి, తిమ్మసాని పల్లి ROBలు, మోతీ నగర్ LHS (లిమిటెడ్ హైట్ సబ్ వే) ఫీజబులిటి రిపోర్ట్ వచ్చింది. మంజూరు దశలో ఉన్నాయి. మంజూరు అయిన వెంటనే ఆ పనులు మొదలు పెట్టడం జరిగింది.

* దేవరకద్రలో LHS మంజూరైంది. ఈ ఏడాది సెప్టెంబర్ లో టెండర్స్ ఆహ్వానిస్తామని తెలిపారు.

* వనపర్తి స్టేషన్ రోడ్ లో ROB మంజూరు అయ్యింది.

* గతంలో ROB, RUBలకు కేంద్రం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులు ఇచ్చేవి. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు వాటా నిధులు మంజూరు చేయక ఆలస్యం అవుతుందని, ప్రస్తుతం పూర్తిగా కేంద్రం వంద శాతం నిధులు అందజేస్తుంది.

* శ్రీరామ్ నగర్ లో కూడా ROB ప్రపోజల్ పంపడం జరిగింది. మంజూరు కూడా వచ్చింది

* మరికల్ - ఇబ్రహీంపట్నం RUB లో వాటర్ లాగింగ్ పాయింట్ లో నీరు నిలవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. దానిపై చర్యలు తీసుకున్నారు.

* మహబూబ్ నగర్ టౌన్ లో రెండవ లైన్ (ట్రాక్) కు మూడు ఏరియాలలో భూ సేకరణ జరిగింది. అక్కడి నివాసితులు ఇండ్లకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారని అధికారుల దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. ఆలస్యం చేయకుండా భూసేకరణ పూర్తి చేయాలని కోరడం జరిగింది.

* గద్వాలలో రెండవ లైన్ పనులు కూడా మంజూరు చేయించడం జరిగింది. ఆ పనులు త్వరలో ప్రారంభమవుతాయని అధికారులు వెల్లడించారు.

* కొవిడ్ సమయం నుంచి వనపర్తి, మక్తల్ లోని కృష్ణా, గద్వాలలో రైల్స్ స్టాప్స్ తీసివేశారు. ప్రజల విజ్ఞప్తుల మేరకు వాటిని పునరుద్ధరించాలని కోరడం జరిగింది. వాటిని పరిశీలిస్తామని తెలిపారు. సికింద్రాబాద్ - రాయచూరు వెళ్ళే రైలు టైమింగ్ మార్చాలని కోరడం జరిగింది. టైమింగ్ మార్పులలో ఇబ్బందులు ఉన్నాయని కొత్త రైలు కోసం ప్రతిపాదనలు పంపుతున్నామని అధికారులు తెలిపారు.

* కృష్ణా - వికారాబాద్ లైన్ కు DPR పూర్తయింది. వాటి పనులను త్వరగా ప్రారంభించాలని కోరాను.

* గద్వాల - డోర్నకల్ కొత్త లైన్ DPR పూర్తి అయ్యింది.

* గద్వాల - మాచర్ల లైన్ ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉంది, దానిని పరిశీలించాలని కోరాం.

* జడ్చర్ల - మిర్యాలగూడ, వికారాబాద్-తాండూరు కొత్త లైన్ కోసం పరిశీలించాలని అధికారులను కోరడం జరిగింది.

* ఎంపీ డీకే అరుణ విజ్ఞప్తి మేరకు మలక్ పేట్ (హైదరాబాద్) రైల్వే స్టేషన్ లో హైదరాబాద్ డెక్కన్ (నాంపల్లి - కర్నూల్ ) హండ్రీ ఎక్స్ ప్రెస్ (17027/17028) రైలు ఆపేందుకు అంగీకరించిన రైల్వే.

#DK Aruna#Railway Officials#Railway Development Works#Secunderabad#Rail Nilayam#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి