తెలంగాణ

ibrahimpatnam: ఇబ్రహీంపట్నంలో ఏసీబీ కలకలం.. ఏవో శ్రీనివాస్ రెడ్డి నివాసాల్లో సోదాలు!..

రచన: Venu••5 నిమిషాల పఠనం

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆర్డీఓ కార్యాలయంలో పనిచేస్తున్న శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై ఆయనకు సంబంధించిన సుమారు 15 ప్రాంతాల్లో ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

లంచం కోసం అడ్డదారులు తొక్కుతున్న అధికారులపై ఏసీబీ కొరడా ఝళిపిస్తోంది. ఓ వైపు ఆదాయానికి మించి ఆస్తుల కేసుల్లో సోదాలు.. మరోవైపు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడుతున్న అధికారులు.. ఇలా వరుస ఏసీబీ దాడులతో ప్రభుత్వ కార్యాలయాల్లో కలకలం మొదలైంది.

తాజాగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆర్డీఓ కార్యాలయంలో పనిచేస్తున్న శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై ఆయనకు సంబంధించిన సుమారు 15 ప్రాంతాల్లో ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

శ్రీనివాస్ రెడ్డి గతంలో మహేశ్వరం, బాలాపూర్, శంషాబాద్ ప్రాంతాల్లో ఎమ్మార్వోగా పనిచేశారు. రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో ల్యాండ్ ప్రొటెక్షన్ వింగ్‌లో తహసీల్దార్‌గా కూడా విధులు నిర్వహించారు. 2026 మేలో డిప్యుటేషన్‌పై ఇబ్రహీంపట్నం ఆర్డీఓ కార్యాలయానికి వచ్చిన ఆయన ప్రస్తుతం ఏఓగా విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం.

సోదాల సందర్భంగా ఆయన ఆస్తులు, బ్యాంకు లావాదేవీలు, స్థిరాస్తులు, ఇతర ఆర్థిక వ్యవహారాలపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు.. మరోవైపు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడుతున్న అధికారుల సంఖ్య కూడా ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలో జూన్‌లో సంగారెడ్డి ట్రాన్స్‌కోకు చెందిన అదనపు అసిస్టెంట్ ఇంజనీర్ 25 వేల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. జూలైలో పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయానికి చెందిన అసిస్టెంట్ ఇంజనీర్ సతీష్ కుమార్ రెండు లక్షల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. అనంతరం ఆయన ఇంట్లో జరిపిన సోదాల్లో 32 లక్షల రూపాయలకు పైగా లెక్కల్లో చూపని నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

మరోవైపు హైదరాబాద్‌లో మే నెలలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు చెందిన ఓ ఇన్‌స్పెక్టర్ తొమ్మిది లక్షల రూపాయల లంచం డిమాండ్ చేసి, ఐదు లక్షలు తీసుకున్నట్లు ఏసీబీ కేసు నమోదు చేసింది. అతని ఇంట్లో సోదాల్లో 13 లక్షల రూపాయల నగదుతో పాటు బంగారం, ఆస్తి పత్రాలు లభించినట్లు అధికారులు తెలిపారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది.

అనకాపల్లి మైన్స్ అండ్ జియాలజీ కార్యాలయానికి చెందిన సర్వేయర్ మురళీకృష్ణ ఐదు లక్షల రూపాయల లంచం తీసుకుంటూ ఆగస్టులో ఏసీబీకి పట్టుబడ్డారు. అంతకుముందు కూడా ఆయనపై ఏసీబీ ట్రాప్ కేసు నమోదైనట్లు అధికారులు తెలిపారు. అలాగే రెండురోజుల క్రితం ఒంగోలు కార్పోరేషన్ ఆర్‌ఐ నరేంద్ర కొత్త ఇంటికి పన్ను విధించేందుకు రూ.15వేలు లంచం డిమాండ్ చేశాడు.

దీంతో బాధితులు ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో.. వారు ఆర్‌ఐని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇక నరేంద్ర ఐదు రోజుల క్రితం జరిగిన స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఉత్తమ అధికారిగా మంత్రి, కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంస పత్రం అందుకున్నాడు. ప్రస్తుతం ఈ అంశం చర్చాంశనీయంగా మారింది. అవార్డు వచ్చిన రెండు రోజులకే లంచం తీసుకుని పట్టుబడటంతో స్థానికులు ఆయనపై మండిపడుతున్నారు. ఇలాంటి వాడికి అసలు అవార్డు ఎలా ఇచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

#Telangana#Hyderabad#ibrahimpatnam#ACB raids#A.O. Srinivas Reddy
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి