క్రైమ్

Visakha: విశాఖలో ఘోరం.. టీచర్ కొట్టడంతో క్లాస్ రూమ్‌లోనే ఆరేళ్ల బాబు మృతి

రచన: NK••4 నిమిషాల పఠనం

Visakha: విశాఖలోని లిటిల్ గార్డెన్ స్కూల్ లో ఘోరం జరిగింది. ఎల్ కేజీ విద్యార్థి క్లాస్ రూమ్ లోనే కుప్పకూలాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ప్రణయ్ తేజ్ (6) లిటిల్ గార్డెన్ స్కూల్ లో ఎల్ కేజీ చదువుతున్నాడు. హోంవర్క్ చేయలేదని క్లాస్ టీచర్ ప్రణయ్ ని మందలించి కొట్టింది. దీంతో ప్రణయ్ తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. గుక్క పెట్టి ఏడ్చాడు. అలానే టీచర్ పైనే కుప్పకూలాడు.

వెంటనే స్కూల్ సిబ్బంది బాబును కేజీహెచ్ కు తరలించారు. అయితే, అప్పటికే ప్రణయ్ చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. క్లాస్ రూమ్ లోనే ప్రణయ్ టీచర్ పై కుప్పకూలిన ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ వైరల్ గా మారింది. బాబు చనిపోయాడని తెలిసి తల్లిదండ్రులు షాక్ కి గురయ్యారు. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. బాబు మృతదేహానికి కేజీహెచ్ లో పోస్టుమార్టం నిర్వహించారు.

ప్రణయ్ మృతితో స్థానికంగా విషాదం అలుముకుంది. కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. వద్దు వద్దు అంటున్నా షర్ట్ బటన్స్ విప్పి మరీ టీచర్ నా కొడుకును కొట్టిందని తల్లి వాపోయింది. నా కొడుకును నాకు లేకుండా చేసిన స్కూల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. నా బిడ్డకు జరిగినట్లు ఇంకెవరికీ జరక్కూడదని ఆవేదన వ్యక్తం చేసింది.

''ఇంతటి దారుణం ఎక్కడా చూడలేదు. బాబుకి వెంటే సీపీఆర్ చేసి ఉంటే బతికేవాడేమో. బాబు ఎప్పుడు చనిపోయాడో కూడా తెలీదు. మృతదేహాన్ని తెచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. క్లాస్ రూమ్ లోనే బాబు కుప్పకూలినా.. స్కూల్ యాజమాన్యం తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకపోవడం చాలా దారుణం. దీనిపై ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలి. మరో స్కూల్ లో మరో చిన్నారికి ఇలాంటి పరిస్థితి రాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి'' అని స్థానికులు డిమాండ్ చేశారు.

వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి