నేటి తరం యువతులు ఏం చేస్తున్నారో వారికే తెలియడం లేదు. ఎవరితో ఎలా మాట్లాడాలి? ఎలా ప్రవర్తించాలి? అధికారుల ముందు ఎలా బిహేవ్ చేయాలి? పోలీసులు, భద్రతా బలగాలతో ఎలా నడుచుకోవాలో తెలియడం లేదంటూ కొందరు సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. ఇటీవల ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా నేటితరం విద్యార్థులు (జెన్ జీ) పెద్దఎత్తున నిరసన తెలిపిన విషయం తెలిసిందే. విద్యార్థుల నిరసనలకు గాను కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.
అయితే,ఆ ఒక్క జెన్ జీ అనే పదాన్ని పట్టుకుని ఓ యువతి ఏకంగా భద్రతా బలగాలను బెదిరించే ప్రయత్నం చేసింది.ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సదరు యువతి ప్రవర్తనపై నెటిజన్లు విరుచుకపడుతున్నారు. వివరాల్లోకివెళితే.. జమ్మూకాశ్మీర్ పర్యటనకు వెళ్లిన ఓ యువతి ఆర్మీ అధికారులతో వాగ్వాదం పెట్టుకుంది. భద్రత కారణాల దృష్ట్యా ఓ చెక్ పోస్ట్ వద్ద రోడ్డును భద్రతా బలగాలు బ్లాక్ చేశాయి.సమయం గడుస్తున్నా రోడ్డు బ్లాక్ తీయడం లేదని ఓ యువతి రెచ్చిపోయింది.
‘మేం జెన్ జీ’.. అసలు ఏమనుకుంటున్నారు? ఐదు గంటలు గడుస్తున్నా చెక్ పోస్ట్ ఓపెన్ చేయడం లేదు. ఈ నాన్‌సెన్స్‌ను సహించం.డబ్బులు పెట్టి వచ్చింది ఇలా వెయిట్ చేయడానికా? కాశ్మీరీలతో వలే టూరిస్టులతోనూ ప్రవర్తిస్తున్నారు’ అంటూ ఆర్మీ జవాన్లపై యువతి వీరంగం సృష్టించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవ్వడంతో జమ్మూకాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా స్పందించారు.
https://x.com/TeluguScribe/status/2090310175718863224?s=20
జెన్ జీ అనే పదాన్ని బెదిరింపులా వాడొద్దని, సెన్సిటివ్ ప్రాంతాల్లో చెకింగ్ తప్పనిసరి ఉంటుందని, యువతి తీరును సీఎం ఒమర్ అబ్దుల్లాతప్పుబట్టారు. ఇదిలాఉండగా,ఆ యువతికి బలగాలు సరైన గుణపాఠం నేర్పించాలని, మరోసారి వినయంతో నడుచుకునేలా, వీరంగా సృష్టించకుండా ఉండేలా శిక్ష వేయాలని పలువురు సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు.


