ఏపీలో మరో ఘరానా మోసం వెలుగుచూసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువకుడిని నిండా ముంచిన ఘటన ఆలస్యంగా వెలుగుచూడటంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. పెళ్లివరకు తీసుకువచ్చిన సదరు యువతి..లాస్ట్ మినిట్‌లో పెళ్లి రద్దు చేసుకుని ఫోన్ స్విచ్ఛాఫ్ చేయడంతో బాధిత యువకుడు కంగుతిన్నాడు. ఈ ఘటన ఏపీలోని వైఎస్సార్ కడప జిల్లాలో చోటుచేసుకున్నట్టు సమాచారం.
వివరాల్లోకివెళితే.. వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల పశుసంవర్ధక శాఖలో కడపకు చెందిన ఓ యువతి ఉద్యోగం చేస్తున్నది.అయితే, అదే జిల్లా వేంపల్లె మండలంలోని ఓ గ్రామానికి చెందిన ప్రసాద్ అనే వ్యక్తితో సదరు యువతికి ఏడాది క్రితం పరిచయం ఏర్పడింది. తనకంటే వయసులో చిన్న వాడైన ప్రసాద్‌ను ప్రేమించి, పెళ్లి చేసుకునేందుకు యువతి సిద్ధపడింది. రైతులకు ఇవ్వాల్సిన పశువుల దాణాను రెండు బస్తాలు ఎక్కువ ఇచ్చేసరికి, కాబోయే కోడలు చాలా మంచిదని ప్రసాద్ తల్లిదండ్రులు మురిసిపోయారు.
https://x.com/TeluguScribe/status/2090314536251494592?s=20
నిన్న ఉదయం పెద్దలు ఇరువురికి పెళ్లి చేయాలని నిశ్చయించారు. దీంతో ఇద్దరూ హైదరాబాద్ వచ్చి రూ.1.50 లక్షలతో పెళ్లి బట్టలు కూడా కొనుగోలు చేశారు. ప్రసాద్ ఫ్యామిలీ అయితే ఏకంగా వారం రోజుల నుంచి వీధిలో షామియానా వేసి, ఇంటికి లైట్లు వేసి, వాడలో అందరికీ భోజనాలు ఏర్పాటు చేసింది.కాగా, పెళ్లి ముహూర్తం రోజున మండపానికి ఏ సమయానికి వస్తుందో కనుక్కుందామని యువతికి ఫోన్ చేయగా స్పందించకపోవడంతో ప్రసాద్ కుటుంబ సభ్యులు భయపడ్డారు.
ప్రసాద్ పదే పదే ఫోన్ చేయగా.. "సారీ" అని యువతి నుంచి మెసేజ్ వచ్చింది. మెసేజ్ చూసి మరింత ఆందోళనతో అనేక సార్లు ఫోన్ చేయగా, ఫోన్ లిఫ్ట్ చేసి.. "నిన్ను పెళ్లి చేసుకుంటే మా అమ్మ చనిపోతానంటుంది" అని చెప్పి యువతి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్టు తెలిసింది. అయితే, ఏమైందని ఎంక్వయిరీ చేయగా.. సదరు యువతి గతంలోనే రెండు పెళ్లిళ్లు చేసుకున్నట్టు తెలిసి ప్రసాద్, అతని ఫ్యామిలీ ఒక్కసారిగా షాక్‌కు గురైంది.
తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి రూ.10 లక్షలు ఖర్చు చేయించిందని, న్యాయం చేయాలని ప్రసాద్ పోలీసులను ఆశ్రయించాడు.కాగా, యువతి గతంలో కూడా ఇలాగే రెండు పెళ్లిళ్లు చేసుకుని డబ్బులు వసూలు చేసిందని, ప్రసాద్ బాబాయి కొడుకు నుంచి కూడా రూ.40 వేలు ఖర్చు చేయించిందని పోలీసులు గుర్తించడంతో పాటు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.


