వైరల్ న్యూస్

హైదరాబాద్‌లో కొత్త సమస్య.. రాత్రి వేళల్లో భయాందోళనలో నగరవాసులు!

రచన: Mamatha puppala••3 నిమిషాల పఠనం

హైదరాబాద్ నగరంలో దోమల బెడద మునుపెన్నడూ చూడని రీతిలో కొత్త రూపం దాల్చింది. లంగర్‌హౌస్ పరిసర ప్రాంతాల్లో వేలాది దోమలు ఒక్కచోట గుమిగూడి భూమి నుంచి ఆకాశం వైపు వలయాకారంలో సుడిగాలిలా (మస్కిటో టోర్నడో) ఎగురుతున్న వింత దృశ్యాలు స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి.

హైదరాబాద్ నగరంలో దోమల బెడద మునుపెన్నడూ చూడని రీతిలో కొత్త రూపం దాల్చింది. లంగర్‌హౌస్ పరిసర ప్రాంతాల్లో వేలాది దోమలు ఒక్కచోట గుమిగూడి భూమి నుంచి ఆకాశం వైపు వలయాకారంలో సుడిగాలిలా (మస్కిటో టోర్నడో) ఎగురుతున్న వింత దృశ్యాలు స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఈ అసాధారణ దృశ్యాలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

లంగర్‌హౌస్ మాత్రమే కాకుండా టోలిచౌకి, మెహదీపట్నం, గోల్కొండ, షేక్‌పేట్, జూబ్లీహిల్స్ వరకు ప్రధాన రహదారులపై దోమల గుంపులు భారీగా సంచరిస్తున్నాయి. రోడ్లపై వెళ్లే వాహనదారులకు, స్థానిక నివాసితులకు ఈ పరిస్థితి తీవ్ర ఇబ్బందులను సృష్టిస్తోంది. మురుగు కాలువలు సరిగ్గా శుభ్రం కాకపోవడం, వర్షపు నీరు ఎక్కడికక్కడ నిలిచిపోవడం, చెత్త పేరుకుపోవడమే దోమలు ఇంత తీవ్రస్థాయిలో వృద్ధి చెందడానికి ప్రధాన కారణాలని స్థానికులు వాపోతున్నారు.

సాధారణ వర్షాకాలంలో దోమలు ఉండటం సహజమే అయినా, ఇలా సుడిగాలి ఆకారంలో భారీ గుంపులుగా కనిపించడం ఇదే తొలిసారని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమస్య తీవ్రతను తెలియజేసేలా వీడియోలను జీహెచ్‌ఎంసీ (GHMC) అధికారులకు ట్యాగ్ చేస్తూ నివారణ చర్యలు చేపట్టాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

దోమల ఉత్పత్తిని అరికట్టేందుకు మురుగు నీటి నిల్వలను వెంటనే తొలగించి, ఆయా ప్రాంతాల్లో విస్తృతంగా ఫాగింగ్, రసాయనాల పిచికారీ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున అధికారులు తక్షణమే స్పందించి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

#Mosquito Tornado In Hyderabad Langer House#Hyderabad Mosquito Menace Viral Video#GHMC Mosquito Fogging Tolichowki Mehdipatnam#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి