క్రైమ్

Crime : ఐఫోన్ కోసం మనవరాలి ఘాతుకం..తాతను హత్య చేయించి..!

రచన: Kumar••4 నిమిషాల పఠనం

డబ్బుల మాయలో పడి కొందరు మానవతా విలువలు మర్చిపోతున్నారు. బంధువులు, కుటుంబసభ్యులు అని చూడకుండా దారుణాలకు పాల్పడుతున్నారు.డబ్బులు వచ్చాయా?లేదా?అని మాత్రమే ఆలోచన చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తల్లిదండ్రులు, తోడబుట్టిన వారు, పెద్దలు అని ఏమాత్రం ఆలోచించకుండా ఘాతుకాలకు పాల్పడుతున్న ఘటనలు నానాటికీ పెరిగిపోతున్నాయి.

డబ్బుల మాయలో పడి కొందరు మానవతా విలువలు మర్చిపోతున్నారు. బంధువులు, కుటుంబసభ్యులు అని చూడకుండా దారుణాలకు పాల్పడుతున్నారు.డబ్బులు వచ్చాయా?లేదా?అని మాత్రమే ఆలోచన చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తల్లిదండ్రులు, తోడబుట్టిన వారు, పెద్దలు అని ఏమాత్రం ఆలోచించకుండా ఘాతుకాలకు పాల్పడుతున్న ఘటనలు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఆస్తి కోసం రక్తం పంచుకుని పుట్టిన వారిని,కన్నవారిని సైతం నేటితరంలోని కొందరు వదలడం లేదు. ఏమాత్రం కనికరించకుండా కడతేరుస్తున్నారు.

తాజాగా ఐఫోన్ కోసం తాతను హతమార్చిన ఘటన ఒకటి వెలుగచూసింది. ప్రస్తుతం ఇది దేశవ్యాప్తంగా సంచలనానికి తెరతీసింది. వివరాల్లోకివెళితే.. ఐఫోన్ కోసం ప్రియుడితో కలిసి ఓ 13 ఏళ్ల బాలిక తాతను చంపించింది.ఈ ఘటన కేరళం - అలప్పుజలో చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగుచూసింది. పదమూడేళ్ల బాలిక ప్లాన్ ప్రకారం.. తన బాయ్‌ఫ్రెండ్, మరో ఇద్దరు బాయ్స్‌తో కలిసి బాలిక తాత (67)ను హత్య చేశారు. అనంతరం ఇంట్లోని సుమారు 4 తులాల బంగారం చోరీ చేశారు.

బంగారం అమ్మిన డబ్బులతో తనకు ఐఫోన్, ప్రియుడికి బైక్ కొనాలని మైనర్ పథకం రచించినట్టు సమాచారం. గతంలో తాత తనతో దురుసుగా ప్రవర్తించాడని, దీంతో అతనిని హత్య చేయాలని బాలిక ప్రియుడికి చెప్పినట్టు తెలిసింది. అందుకు ఓకే చెప్పిన ప్రియుడు..తన ఫ్రెండ్స్‌ను వెంటబెట్టుకుని వెళ్లాడు. వెంటిలేటర్ ద్వారా ఇద్దరు అబ్బాయిలు, మెయిన్ డోర్ ద్వారా మరొకరు ఇంట్లోకి వెళ్లి వృద్ధుడిని కట్టేసి చిత్రహింసలు పెట్టినట్టు సమాచారం.

అనంతరం వృద్ధుడిని హత్య చేసేప్పుడు బాలికకు వీడియో కాల్ ద్వారా చూపించినట్టు తెలిసింది. హత్య అనంతరం అక్కడి నుంచి నిందితులు పారిపోగా.. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. నిందితులను గుర్తించి విచారణ చేపట్టగా..హత్యకు ప్లాన్ రచించింది మృతుడి మనవరాలు అని నిర్దారణకు వచ్చారు. ఆ తర్వాత నిందితురాలిని గుర్తించి జువెనైల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపరిచినట్టు పోలీసులు తెలిపారు. హత్యచేసిన వారిని సైతం అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్టు కేరళ పోలీసులు తెలిపారు.

#iphone#grand daughter#killed#grand father#kerala#crime
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి