వ్యాపారం

Silver : ఒక్కరోజే రూ.10 వేలు పెరిగిన ‘సిల్వర్’.. భగ్గుమన్న బంగారం!

రచన: Kumar••4 నిమిషాల పఠనం

పసిడి, వెండి ధరలు మరోసారి వినియోగదారులకు షాక్ ఇచ్చాయి. ఎవరూ ఊహించని విధంగా ఒక్కసారిగా భారీగా ధరలు పెరిగాయి. పెళ్లిళ్ల సీజన్ కావడంతో వెండి, పసిడి కొనుగోలు చేసేందుకు కస్టమర్లు జంకుతున్నారు. అయితే, గ్లోబల్ వైడ్‌గా ఉన్న డిమాండ్ నేపథ్యంలో దేశీయ బులియన్ మార్కెట్లో వెండి, బంగారం ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నితాకాయి. కేవలం సిల్వర్ ఒకే రోజు రూ.10 వేల వరకు ధర పెరగడం గమనార్హం. పసిడి సైతం వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి.

మునుపెన్నడూ లేనివిధంగా వెండి, గోల్డ్ ధరలు పోటీపడి మరీ పెరుగుతున్నాయి.ఆషాఢమాసం సేల్ అయిపోయింది.దీంతో బంగారం వ్యాపారులు, షోరూమ్స్ యజమానులు వినియోగదారులను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తుండగా.. ఒక్కసారిగా ధరలు అమాంతం పెరగడంతో కస్టమర్లు పెద్దగా ఆసక్తి చూపించడం లేదని సమాచారం. శ్రావణ మాసం ప్రారంభం కావడం, పెళ్లిళ్ల సీజన్ రావడంతో బంగారం, వెండికి మరోసారి దేశీయంగా డిమాండ్ పెరిగినట్టు సమాచారం. అంతర్జాతీయ పరిణామాల కారణంగా పెట్టుబడి దారులు సైతం బంగారం, వెండి మీద ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు తెలిసింది.

ఫలితంగా స్టాక్ మార్కెట్లలో బంగారం, వెండి జోరు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ మార్కెట్లలో వెండి ధరలు మళ్లీ భగ్గుమన్నాయి.కిలో వెండి మీద ఒక్కోరోజే రూ.10 వేలు పెరగడంతో రూ.2,60,000కు చేరింది. ఈనెల 11న రూ.10 వేలు పెరిగిన సిల్వర్ ధర.. సరిగ్గా పది రోజుల గ్యాప్ లోనే అదే స్థాయిలో పెరగడం గమనార్హం.పారిశ్రామిక డిమాండ్, అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు కారణంగా ధరలు పెరుగుతున్నట్టు తెలుస్తోంది.కాగా, హైదరాబాద్ బులియన్ మార్కెట్, ఇతర రాష్ట్రాల్లోని మార్కెట్లలో ధరల్లో హెచ్చుతగ్గులు ఉండనున్నాయి.

ఇక బంగారం విషయానికొస్తే.. 24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం రూ.4,300 పెరిగి రూ.1,59,270కు చేరుకుంది. ఆభరణాల తయారీకి వినియోగించే 22 క్యారెట్స్ బంగారం ధర 10 గ్రాములకు రూ.3,950కు ఎగబాకి రూ.1,46,000 పలుకుతోంది. బంగారం ధరలు ఇలాగే మున్ముందు పెరుగుతూ వెళ్లితే తప్పకుండా కొనుగోళ్లపై భారం పడుతుందని వ్యాపారవర్గాలు వెల్లడించాయి.

#Gold#silver#prices hike#hyderabad#bullion market
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి