వైరల్ న్యూస్

సముద్రాలు దాటిన ప్రేమ.. కేరళలో భారతీయ మహిళను పెళ్లాడిన స్కాటిష్ ఎంపీ!

రచన: Mamatha puppala••4 నిమిషాల పఠనం

దేశాలు, సంస్కృతులు వేరైనా ప్రేమ ముందు సరిహద్దులు చెరిగిపోయాయి. స్కాట్లాండ్‌కు చెందిన పార్లమెంట్ సభ్యుడు మార్టిన్ డే, కేరళకు చెందిన నిధిన్ చంద్‌ను ప్రసిద్ధ గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయంలో హిందూ సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు.

దేశాలు, సంస్కృతులు వేరైనా ప్రేమ ముందు సరిహద్దులు చెరిగిపోయాయి. స్కాట్లాండ్‌కు చెందిన పార్లమెంట్ సభ్యుడు మార్టిన్ డే, కేరళకు చెందిన నిధిన్ చంద్‌ను ప్రసిద్ధ గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయంలో హిందూ సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. తొమ్మిదేళ్ల క్రితమే యూకేలో చట్టబద్ధంగా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న ఈ జంట, ఇరు కుటుంబ సభ్యులు, నిధిన్ 22 ఏళ్ల కుమారుడు వేదిక్ శంకర్ సమక్షంలో వేద మంత్రోచ్ఛారణల నడుమ ఒక్కటయ్యారు.

వివరాల్లోకి వెళ్తే.. మార్డిన్, నిధిన్ చంద్ పరిచయం 2016లో వీసా సమస్యల నేపథ్యంలో యూకేలో మొదలైంది. ఎర్నాకుళం జిల్లా పిరవోమ్‌కు చెందిన నిధిన్ ఉన్నత చదువుల కోసం యూకే వెళ్లి పీహెచ్‌డీ పూర్తి చేశారు. అప్పట్లో విదేశీ విద్యార్థుల వీసా నిబంధనలు కఠినతరం కావడంతో పార్లమెంటరీ కమిటీల ముందు తన వాదనను వినిపించిన సమయంలో, అప్పటి స్కాటిష్ నేషనల్ పార్టీ ఎంపీ మార్టిన్ డేతో ఆమెకు స్నేహం ఏర్పడింది. ఆ తర్వాత ఆ స్నేహం కాస్త ఇద్దరి మనసులను కలిపి ప్రేమగా మారింది.

అప్పటికే విడాకులు తీసుకుని ఒంటరిగా కుమారుడిని పెంచుతున్న నిధిన్ పెళ్లి విషయమై మొదట్లో సంశయించింది. ఈ నేపథ్యంలో మార్టిన్ ఆమెకు కొండంత అండగా నిలిచాడు. యూకేలో వివాహం నమోదైనప్పటికీ, స్వదేశంలోని గురువాయూర్ ఆలయంలో సంప్రదాయబద్ధంగా తాళి కట్టించుకోవాలన్నది నిధిన్ చిరకాల కోరిక. గతంలో వరదలు, కరోనా పరిస్థితుల వల్ల వాయిదా పడుతూ వచ్చిన వీరి కల, నాలుగోసారి పర్యటనలో ఎట్టకేలకు సాకారమైంది.

ప్రస్తుతం నిధిన్ లండన్‌లో మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్‌గా, ఆమె కుమారుడు ఎడిన్‌బర్గ్‌లో సీనియర్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్‌గా స్థిరపడ్డారు. స్కాటిష్ రాజకీయాల్లో ప్రజాసేవలో కొనసాగుతున్న ఎంపీ మార్టిన్ డే, సంప్రదాయ పంచెకట్టులో భారతీయ సంస్కృతిని గౌరవిస్తూ పెళ్లి చేసుకోవడం విశేషం. ఈ అరుదైన పెళ్లి వేడుకకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

 

#Scottish MP Martin Day Marries Indian Woman Nithin Chand#Guruvayur Temple Wedding Scottish MP#Kerala Traditional Marriage Martin Day Nithin#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి