అధికార కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి జ్వాలలు ఎగడిపడుతూనే ఉన్నాయి. మొన్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మరో ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, ప్రణాళికసంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి వంటి వారు సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మీద ధిక్కార స్వరం వినిపించిన విషయం తెలిసిందే.తాజాగా రేవంత్ రెడ్డి మంత్రివర్గంలోని మినిస్టర్ కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత నిన్ని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది.
అయితే,కొండా సుస్మిత వ్యాఖ్యలపై పార్టీ అధిష్టానం సీరియస్ అయినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కొండా సుస్మిత వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని మంత్రి సురేఖకు పీసీసీ క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇచ్చినట్టు సమాచారం.వాటిని మంత్రి కూడా అందుకున్నట్టు తెలిసింది. గురువారం గాంధీ భవన్‌లో నిర్వహించే పీసీసీ క్రమశిక్షణా కమిటీ భేటీకి ఆమె హాజరై తనకూతురు చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇస్తారని ప్రచారం జరుగుతోంది.
ఇదిలాఉండగా, రెండ్రోజుల కిందట పరకాలలో నిర్వహించిన బహిరంగసభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిన్న మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత కౌంటర్ ఇచ్చారు. తన ఆవేదనను, మంత్రులు, ముఖ్యంగా బీసీ ఎమ్మెల్యేలు,నేతలకు జరుగుతున్న అన్యాయాన్ని ఆమె వెల్లగక్కారు. పరకాల సభలో సీఎం మాట్లాడుతూ.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రేవూరి ప్రకాశ్‌రెడ్డిని మళ్లీ కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటిస్తూ చేసిన వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
సీఎం చేసిన ఈ ఒక్క ప్రకటనతో పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి తలెత్తాయి.అభ్యర్థులను డిసైడ్ చేయడానికి ‘నువ్వు ఎవరూ రేవంత్’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది సుస్మిత.. ‘పొంగు’ను చూసుకుని సీఎం ఎగురుతున్నారని, ఆ పొంగు ఎక్కవ రోజులు ఉండబోదని విమర్శించారు.తన తండ్రి కొండా మురళికి ఎమ్మెల్సీ ఇస్తానని సీఎం చెప్పారని.. ఏమైందని ప్రశ్నించారు. అంతేకాకుండా, బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం ప్రాధాన్యత ఇవ్వడం లేదని,వారి శాఖల్లో జోక్యం చేసుకుంటున్నారని కొండా సుస్మిత ఫైర్ అయిన విషయం తెలిసిందే. అయితే, కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ తీవ్రంగా స్పందించింది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించేలా ఈ కామెంట్లు ఉన్నాయని భావిస్తూ పీసీసీ క్రమశిక్షణ కమిటీ మంత్రి కొండా సురేఖకు నోటీసులు జారీ చేసింది.
ఆ నోటీసులు అందుకున్న మంత్రి కాసేపట్లో పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరుకానున్నట్టు సమాచారం. తన కూతురు కొండా సుస్మిత.. సీఎం రేవంత్ మీద అలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చిందో, ఆ పరిస్థితులకు గల కారణాలను కమిటీకి రాతపూర్వకంగా వివరణ ఇవ్వనున్నట్టు టాక్ వినిపిస్తోంది. సుస్మిత చేసిన వ్యాఖ్యలు ఆమె సొంత అభిప్రాయాలని, వాటితో పార్టీకి సంబంధం లేదని కొండా సురేఖ ఇప్పటికే వెల్లడించారు. ఇదే విషయాన్ని ఆమె పీసీసీ కమిటీకి వివరించనున్నారు.కాగా, కొండా సురేఖకు.. సీఎం రేవంత్ తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని తెలుస్తుండగా.. ఆమె శాఖలో ఇతరుల జోక్యాన్ని(కడియం శ్రీహరి) కొండా తీవ్రంగా తప్పుబట్టారు.ఈ విషయంలో సీఎం నుంచి తనకు భరోసా లేకపోవడంతో ఆమె పరకాల సభకు సైతం దూరంగా ఉన్నారు. దీంతో సీఎం,కొండా ఫ్యామిలీకి మధ్య దూరం పెరిగినట్టు టాక్ వినిపిస్తోంది.


