రాజకీయాలు

Congress : రేవంత్‌కు షాకిచ్చిన పీసీసీ చీఫ్.. ‘రేవూరి’ అభ్యర్థిత్వ ప్రకటన చెల్లదు

రచన: Kumar•••5 నిమిషాల పఠనం

కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఒక్కసారిగా తీవ్ర స్థాయికి చేరినట్టు తెలుస్తోంది. కొందరు నేతలు ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తున్నారు. ఇప్పటికే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనకు మంత్రి పదవి ఇస్తానని కాంగ్రెస్ అధిష్టానం హామీ ఇచ్చిందని, కానీ సీఎం రేవంత్ అడ్డుపడుతున్నారని పరోక్షంగా విమర్శలు గుప్పిస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఒక్కసారిగా తీవ్ర స్థాయికి చేరినట్టు తెలుస్తోంది. కొందరు నేతలు ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తున్నారు. ఇప్పటికే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనకు మంత్రి పదవి ఇస్తానని కాంగ్రెస్ అధిష్టానం హామీ ఇచ్చిందని, కానీ సీఎం రేవంత్ అడ్డుపడుతున్నారని పరోక్షంగా విమర్శలు గుప్పిస్తున్నారు. అదే విధంగా అధికారపార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సైతం సీఎం తీరుపై గరంగరంగా ఉన్నారు.

మాజీ మంత్రి, ప్రణాళికసంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి సైతం సీఎం రేవంత్ తీరును తప్పుబట్టారు. తనకు సోనియా గాంధీని గత ఎన్నికల్లో టికెట్ ఇస్తే.. సీఎం రేవంత్..మేఘారెడ్డికి అమ్ముకున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఇక పరకాల నియోజకవర్గంలో బీజేపీ నుంచి వచ్చిన రేవూరి ప్రకాశ్ రెడ్డికి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడుతారని, ఆయనకే ఓటు వేసి గెలిపించాలని సీఎం రేవంత్ పిలుపునివ్వడంతో అటు మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు.

‘రేవూరి’ని ఏకపక్షంగా ఎలా ప్రకటిస్తారని సీఎం రేవంత్ మీద తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆ నిర్ణయం కాంగ్రెస్ హైకమాండ్ చేతిలో ఉంటుందని పేర్కొన్నారు.ఎందుకంటే ఆమె వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి పోటీ చేయాలని టికెట్ ఆశిస్తున్నట్టు సమాచారం. దీనిపై పీపీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ సీరియస్ అవ్వడంతో పాటు మంత్రి కొండా సురేఖ.. తన కూతురు సీఎం మీద చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని నోటీసులు పంపారు.నేడు పీసీసీ క్రమశిక్షణ కమిటీ విచారణకు హాజరవ్వాలని నోటీసుల్లో పేర్కొనగా.. మంత్రి కొండా సైతం విచారణకు హాజరై వివరణ ఇవ్వడానికి వెళ్లినట్టు సమాచారం.

ఇదిలాఉండగా, వచ్చే ఎన్నికల్లో పరకాల నియోజకవర్గం నుంచి రేవూరి ప్రకాశ్ రెడ్డి నిలబడతారని సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు.గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఎమ్మెల్యే అభ్యర్థిని సీఎం రేవంత్ రెడ్డే కాదు.. ఎవరూ ప్రకటించినా చెల్లదు’ అని కుండబద్ధలు కొట్టారు. ఎమ్మెల్యేల అభ్యర్థులను నిర్ణయించేది కాంగ్రెస్ అధిష్టానం మాత్రమే అని అన్నారు.

ఓ ఎమ్మెల్యే అభ్యర్థిని ఎంపిక చేయాలంటే.. స్టేట్ ఎలక్షన్ కమిటీ, ఆ తర్వాత ఢిల్లీలోని సెంట్రల్ ఎలక్షన్ కమిటీ, చివరగా సీడబ్ల్యూసీ చేతిలో నిర్ణయం ఉంటుందన్నారు. ఎవరికి వారు ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించుకుంటే చెల్లదని టీపీసీసీ చీఫ్ స్పష్టంచేశారు.

#congress#cm revanth reddy#tpcc cheif mahesh goud#Aicc#telangana
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి