క్రైమ్

TG : సిద్దిపేటలో తీవ్ర విషాదం..ఒకే కుటుంబంలో నలుగురి దుర్మరణం

రచన: Kumar••4 నిమిషాల పఠనం

రాష్ట్రంలో తీవ్ర విషాదం నెలకొన్నది.ఎవరూ ఊహించని విధంగా ప్రమాదవశాత్తు ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందారు. సిద్ధిపేట జిల్లాలో ఈ విషాదం చోటుచేసుకోగా.. ఒక్కసారిగా జిల్లా ప్రజలు షాక్‌కు గురైనట్టు తెలుస్తోంది.కుటుంబం ప్రయాణిస్తున్న కారు ప్రమాదవశాత్తు బావిలోకి దూసుకెళ్లినట్టు సమాచారం. ఈ ప్రమాదంలో అందులోని వారంతా మరణించినట్టు తెలిసింది.

రాష్ట్రంలో తీవ్ర విషాదం నెలకొన్నది.ఎవరూ ఊహించని విధంగా ప్రమాదవశాత్తు ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందారు. సిద్ధిపేట జిల్లాలో ఈ విషాదం చోటుచేసుకోగా.. ఒక్కసారిగా జిల్లా ప్రజలు షాక్‌కు గురైనట్టు తెలుస్తోంది.కుటుంబం ప్రయాణిస్తున్న కారు ప్రమాదవశాత్తు బావిలోకి దూసుకెళ్లినట్టు సమాచారం. ఈ ప్రమాదంలో అందులోని వారంతా మరణించినట్టు తెలిసింది.

వివరాల్లోకివెళితే.. సిద్ధిపేట దుబ్బాక మండలం బల్వంతాపూర్ గ్రామానికి చెందిన దండుగుల రాజు (30), అతని భార్య భాగ్య (25), కొడుకు నిహాన్ష్ (4), కూతురు శాన్విక (2)తో కలిసి కారులో సిద్దిపేట నుంచి ఇంటికి వెళ్తున్నారు.అయితే, మార్గంమధ్యలో అప్పనపల్లి శివారులో ప్రమాదవశాత్తు కారు వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లినట్టు సమాచారం.ఈ ప్రమాదంలో కుటుంబంలోని వారంతా మృతి చెందినట్టు తెలిసింది.

స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. జేసీబీ సాయంతో కారును బయటకు తీసినట్టు తెలుస్తోంది. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించినట్టు సమాచారం. కారును బయటకు తీసి చూడగా అందులోని వారంతా విగతజీవులుగా కనిపించినట్టు తెలిసింది. అనంతరం మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి మరణించినట్టు తెలిసింది.

https://x.com/pulsenewsbreak/status/2090269946307895675?s=20

కారు ప్రమాదంలో కుటుంబసభ్యులు అంతా మరణించడంతో జిల్లాలో తీవ్ర విషాదం అలుముకుంది. మరోవైపు సమాచారం అందడంతో బాధిత కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. అయితే, ప్రమాదానికి గల కారణాలను విశ్లేషించే పనిలో పోలీసులు నిమగ్నం అయ్యారు. బ్రేక్ ఫెయిల్ వలన అలా జరిగిందా? లేక కారు డ్రైవ్ చేస్తున్న రాజు నిద్రమత్తులో ఉండటం వలన ఇలా జరిగిందా? అనేది తెలియాల్సి ఉంది.విచారణ పూర్తయ్యాక అసలు వివరాలు వెల్లడించనున్నట్టు పోలీసులు తెలిపారు.

https://x.com/TeluguScribe/status/2090275956871111037?s=20

#Car accident#drowned#well#4 members#died#siddipet
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి