తెలంగాణ

TG : మాకు ఓటు హక్కు వస్తే రేవంత్‌ను మళ్లీ రానివ్వం : పాలిటెక్నిక్ విద్యార్థులు

రచన: Kumar••5 నిమిషాల పఠనం

సీఎం రేవంత్ సర్కారు మీద పాలిటెక్నిక్ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘శక్తి’ స్కీం తీసుకొచ్చిన సర్కారు.. అందులోనే స్కిల్డ్ కోర్సులు అన్నింటినీ అనుసంధానం చేయాలని విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతున్న సీఎం ఆలోచన చేసిన విషయం తెలిసిందే.

సీఎం రేవంత్ సర్కారు మీద పాలిటెక్నిక్ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘శక్తి’ స్కీం తీసుకొచ్చిన సర్కారు.. అందులోనే స్కిల్డ్ కోర్సులు అన్నింటినీ అనుసంధానం చేయాలని విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతున్న సీఎం ఆలోచన చేసిన విషయం తెలిసిందే. దీంతో పాలిటెక్నిక్ విద్యార్థులు తమ కోర్సు పూర్తి అయ్యాక బీటెక్ చేయడం కంటే టెక్నికల్, బ్లూకాలర్ స్కిల్డ్ కోర్సులు నేర్పించి ఉద్యోగావకాశాలు చూపించాలని పలు కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.

విద్యార్థుల సాంకేతిక, నైపుణ్య శిక్షణ వ్యవస్థను మెరుగుపరచడానికి, యువతకు ఉపాధి అవకాశాలు పెంచడానికి శక్తి (SHAKTI - Skill Human Capital and Knowledge Training Initiatives) విధానాన్ని జీవో 97 ద్వారా రేవంత్ ప్రభుత్వం తెచ్చింది. దీని ద్వారా పాలిటెక్నిక్, ఐటీఐ (ITIs), ఇతర అధునాతన కేంద్రాలను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ (YISU) పరిధిలోకి అనుసంధానించాలని ప్రణాళిక రూపొందించారు.

అయితే, శక్తి స్కీం ద్వారా మూడేళ్ల సాంకేతిక పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సును సాధారణ నైపుణ్య శిక్షణ లేదా ఐటీఐ స్థాయికి కుదించి, దాని ప్రత్యేక గుర్తింపును మరుగున పరిచే అవకాశం ఉందని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.పాలిటెక్నిక్ తర్వాత నేరుగా ఇంజినీరింగ్ (B.Tech) రెండో సంవత్సరంలో ప్రవేశం కల్పించే 'ఈసెట్' (ECET) లాటరల్ ఎంట్రీ విధానం దెబ్బతింటుందని, దీనివల్ల నేరుగా బీటెక్ చదివే అవకాశాన్ని కోల్పోతామని విద్యార్థులు భయపడుతున్నట్టు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే రాష్ట్రంలోని పాలిటెక్నిక్ విద్యార్థులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థులు రోడ్డెక్కి నిరసనప్రదర్శనలు చేసిన విషయం తెలిసిందే. కాగా, నిన్న ఓ నిరసన ప్రదర్శనలో పాల్గొన్న ఓ విద్యార్థిని మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి. ‘రేవంత్ రెడ్డి మమ్మల్ని లేబర్‌లను చేయాలని చూస్తున్నాడు. మాకు 18 ఏళ్లు వచ్చాక ఆయన సంగతి చూస్తాం.. మళ్లీ గెలవకుండా చేస్తాం. రేవంత్ రెడ్డి తెచ్చిన శక్తి స్కీం వల్ల మా లైఫ్ నాశనం అయిపోతుంది’ అని సదరు విద్యార్థిని ఆవేదన వ్యక్తం చేసింది.ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి తెచ్చిన శక్తి స్కీం రద్దు చేయాలని హైదరాబాద్‌లోని మాసబ్ ట్యాంక్ పరిధిలో కొందరు పాలిటెక్నిక్ విద్యార్థుల నిరసన ప్రదర్శన చేపట్టారు.

శక్తి స్కీంను రద్దు చేయాలని మరికొందరు విద్యార్థినులు డిమాండ్ చేశారు. ‘మా తల్లిదండ్రులు మేము డిప్లొమా చేస్తున్నామని అనుకుంటున్నారు, స్కిల్ యూనివర్సిటీలో కలిపితే లేబర్ పనులు చేస్తున్నామని అనుకోవాలా? మీరు విద్యా వ్యవస్థను బాగు చేయాలనుకుంటే మాకు సౌకర్యాలను మెరుగుపరచండి’ అంటూ నల్గొండ పాలిటెక్నిక్ విద్యార్థిని ఆవేదన వ్యక్తంచేసింది.

‘మేము బీటెక్ చేయొద్దని చెప్పడానికి మీరెవరు? స్కిల్స్ నేర్చుకుని బీటెక్ చేద్దామనే మేము పాలిటెక్నిక్ కోర్సులో చేరుతాము.ఇప్పుడు మీరు వచ్చి బీటెక్ చేయకండి, అది వేస్ట్ అంటే ఎలా? అవసరమైతే పాలిటెక్నిక్ కాలేజీలను బలోపేతం చేయండి కానీ ఈ వ్యవస్థను రద్దు చేయొద్దు’అని నల్గొండలో మరో పాలిటెక్నిక్ విద్యార్థిని ఆగ్రహం వ్యక్తంచేసింది.

#polytechnic students#telangana#oppose#shakti scheme#protests#cm revanth reddy
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి