ఏపీ

Ap : టెట్ ఫెయిల్.. నవవధువు షాకింగ్ నిర్ణయం

రచన: Kumar••3 నిమిషాల పఠనం

ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే తపనతో కొందరు యువతీయువకులు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నట్టు తెలుస్తోంది. జాబ్స్ కోసం అహర్నిషలు కష్టపడుతున్న నేటితరం యువత.. ఫలితం కాస్త వ్యతిరేకంగా వచ్చేసరికి తీసుకోలేకపోతున్నారు. ఇక ఈ జీవితం చాలు అనుకుని జీవిత ప్రయాణాన్ని మధ్యలోనే ముగించేస్తున్నారు.ఫలితంగా కన్నవారికి కడుపుకోతను మిగులుస్తున్నారు. తాజాగా జరిగిన ఘటన ఇందుకు అద్దం పడుతోంది.

ఏపీకి చెందిన ఓ యువతి దారుణానికి ఒడిగట్టింది. పరీక్షలో ఫెయిల్ అయ్యాయని బలవన్మరణానికి పాల్పడింది. ప్రస్తుతం ఈ ఘటన కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. కాగా,సదరు యువతికి ఇటీవలే పెళ్లి జరిగిందని సమాచారం. యువతి చేసిన పనికి అటు అత్తింట్లోనూ , ఇటు తల్లిగారింట్లోనూ తీవ్ర విషాదం నెలకొంది.

వివరాల్లోకివెళితే.. ఏపీలోని విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం చినరాజేరు గ్రామానికి చెందిన తనూజ(22)..రీసెంట్‌గా ఏపీ ప్రభుత్వం నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)రాసింది. పరీక్షలో ఆమె ఫెయిల్ కావడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు సమాచారం. గమనించిన కుటుంబసభ్యులు ఆమెను కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది.

https://x.com/pulsenewsbreak/status/2090658258105274639?s=20

అయితే, తనూజకు పెళ్లయి 50 రోజులు మాత్రమే అవుతున్నట్టు తెలిసింది. నవవధువు ఆత్మహత్య చేసుకోవడంతో రెంటు కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పెదమానాపురం పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. పోస్టుమార్టం కోసం యువతి మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్టు తెలిసింది.

#newly bride#suicide#andrapradesh#TET failed#crime
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి