తెలంగాణ

TG : వామ్మో పెద్దపులి.. డప్పు చాటింపులు, మైకుల్లో హెచ్చరికలు!

రచన: Kumar••4 నిమిషాల పఠనం

రాష్ట్రంలో మరోసారి అలజడి నెలకొంది. ఉత్తర తెలంగాణలో మరోసారి పెద్దపులి సంచారం అక్కడి ప్రజలు, రైతులను నిద్రలేకుండా చేస్తున్నది.రాత్రిళ్లు బయటకు వెళ్లాలంటేనే జనాలు జంకుతున్నారు. పశువులు, చిన్న పిల్లలను కాపాడుకునేందుకు రాత్రిబవళ్లు కంటిమీద కునుకు లేకుండా కాపలా కాస్తున్నట్టు సమాచారం.

రాష్ట్రంలో మరోసారి అలజడి నెలకొంది. ఉత్తర తెలంగాణలో మరోసారి పెద్దపులి సంచారం అక్కడి ప్రజలు, రైతులను నిద్రలేకుండా చేస్తున్నది.రాత్రిళ్లు బయటకు వెళ్లాలంటేనే జనాలు జంకుతున్నారు. పశువులు, చిన్న పిల్లలను కాపాడుకునేందుకు రాత్రిబవళ్లు కంటిమీద కునుకు లేకుండా కాపలా కాస్తున్నట్టు సమాచారం.ఫారెస్టు అధికారులు సైతం అడుగు జాడలను గుర్తించడంతో పులి సంచారం ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యింది.

దీంతో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో హై అలర్ట్ ప్రకటించినట్టు సమాచారం. కౌటాల, సిర్పూర్, చింతలమానేపల్లి మండలాల్లో పెద్దపులి సంచరించినట్టు స్థానిక రైతులు గుర్తించి ఫారెస్టు అధికారులకు సమాచారం అందించినట్టు తెలిసింది. ఆడేపల్లి, శీర్ష గ్రామాల సమీపంలోని పంట పొలాల్లో పులి పాదముద్రలు కలకలం రేపడంతో అధికారులు అక్కడకు చేరుకుని పరిశీలించగా.. నిజంగానే అవి పెద్దపులి పాదముద్రలుగా నిర్దారించారు.

https://x.com/pulsenewsbreak/status/2090675910357991868?s=20

దీంతో రైతులు, స్థానికుల్లో భయాందోళన నెలకొంది.అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. కనికి, కన్నెపల్లి, బోదంపల్లి, డబ్బా, ఆడేపల్లి, బారెగుడ శివార్లలో పులి సంచారం ఉన్నందున వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్టు అధికారులు సూచనలు చేశారు.

అటవీ ప్రాంతాల వైపు ఒంటరిగా వెళ్లొద్దని హెచ్చరించారు. పులి సంచారం ఉన్న గ్రామాల్లో డప్పు చాటింపులు, మైక్‌ల ద్వారా హెచ్చరికలు చేయిస్తున్నారు. పులి పాదముద్రలు లేదా ఇతర ఆనవాళ్లు కనిపిస్తే వెంటనే అటవీశాఖకు సమాచారం ఇవ్వాలని సూచించారు.రైతులు తమ పశువులను అడవిలోకి తీసుకెళ్లవదని, తోడుగా కర్ర ఉంచుకోవాలని హెచ్చరించారు. పశువులను బయట కట్టేసిన వారు రాత్రిళ్లు గమనించాలని, బయటకు మాత్రం రావొద్దని, కంచె వేసుకోవాలని అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.

#tiger#roaming#asifabad#forest department#warning sign
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి