తెలంగాణ

Crime : హన్మకొండలో దారుణం.. రెండ్రోజులుగా కారు డిక్కీలోనే డెడ్ బాడీ!

రచన: Kumar•••4 నిమిషాల పఠనం

రాష్ట్రంలో మరో దారుణ ఘటన కలకలం రేపింది.కారు డిక్కీలో ఓ యువతి మృతదేహం లభ్యమైంది.రెండ్రోజులుగా కారు అక్కడే ఉండటాన్ని గుర్తించిన స్థానికులు.. డిక్కీలో నుంచి దుర్వాసన రావడాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు.వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు డిక్కీ తెరిచి చూడగా...అందులో కుళ్లినస్థితికి చేరుకున్న ఓ యువతి డెడ్ బాడీ కనిపించడంతో అంతా షాక్ అయ్యారు.

ఈ ఘటన హన్మకొండ జిల్లాలో శుక్రవారం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. జిల్లాలోని ఎల్కతుర్తి మండల కేంద్రంలో కారు (TS 03 FF 8094) డిక్కీలో గుర్తుతెలియని యువతి మృతదేహం లభ్యమైంది. ఎక్కడో చనిపోయిన యువతి బాడీని గుర్తు తెలియని దుండగులు కారులో తీసుకొచ్చి వదిలేసిపోయినట్టు తెలిసింది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు .. మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపించి విచారణ చేపట్టారు.

కారు ఎవరిది అని ఎంక్వైరీ చేయగా.. దాని ఓనర్ సురేందర్‌గా గుర్తించారు. అతన్నిసంప్రదించగా.. అతని నుంచి కొద్ది రోజుల క్రితం వినోద్ అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అద్దెకు తీసుకున్నట్లు గుర్తించారు. దీంతో వినోద్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణలో పలు కీలక విషయాలను రాబట్టారు. ఇక ఘటనా స్థలంలో లభించిన ఆధార్ కార్డు ఆధారంగా కారులో దొరికిన మృతదేహం గోదావరిఖని సెంటినరీ కాలనీకి చెందిన ‘మానస’గా గుర్తించారు.

వినోద్, మానస మధ్య ప్రేమాయణం నడుస్తున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. వీరిద్దరూ కరీంనగర్‌లోని ఓ గదిలో ఉన్న సమయంలో మానసకు ఫిట్స్ వచ్చి మృతి చెందిందని.. వినోద్ విచారణలో భాగంగా వెల్లడించినట్టు తెలిసింది. ఏం చేయాలో తెలియక మృతదేహాన్ని ఎవరూ చూడని సమయంలో కారు డిక్కీలో పెట్టి హన్మకొండకు తీసుకొచ్చి.. భయంతో కారులో వదిలి వెళ్లిపోయినట్టు పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చినట్టు తెలిసింది.

https://x.com/TeluguScribe/status/2090691000033509610?s=20

#car#deadbody#girl#hanmakonda#found#crime#telangana
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి