వైరల్ న్యూస్

Viral : షార్ట్స్ వేసుకున్నారని.. ఓ టూరిస్టు ఫ్యామిలీపై దాడి (వీడియో)

రచన: Kumar•••4 నిమిషాల పఠనం

కొందరు మనుషుల వింత ప్రవర్తన కారణంగా ఓ వర్గం ప్రజలపై ద్వేషం పెరుగుతోందని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. దేశంలో పుట్టిన ప్రతిఒక్కరకీ భావప్రకటన స్వేచ్ఛతో పాటు నచ్చినట్టు జీవించే హక్కును పుట్టుకతోనే కలిగి ఉంటారు.

కొందరు మనుషుల వింత ప్రవర్తన కారణంగా ఓ వర్గం ప్రజలపై ద్వేషం పెరుగుతోందని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. దేశంలో పుట్టిన ప్రతిఒక్కరికీ భావప్రకటన స్వేచ్ఛతో పాటు నచ్చినట్టు జీవించే హక్కును పుట్టుకతోనే కలిగి ఉంటారు.అలాంటిది కొందరు మతాల పేరిట, కల్చర్ పేరిట అడ్డంకులు సృష్టించడం, వారి స్వేచ్ఛకు భంగం కలిగించడం సరికాదు. ఇదే విషయాన్ని న్యాయ నిపుణులు గుర్తుచేస్తున్నారు.

ఏం తినాలి? ఎటువంటి బట్టలు వేసుకోవాలి? ఎలా ఉండాలి? అనేది భారతీయుడిగా పుట్టిన వారికి రాజ్యాంగం కొన్ని ప్రాథమిక హక్కులను కల్పించింది.దానిప్రకారం ఏదైనా చేయొచ్చు. దానికి అడ్డు చెప్పే హక్కు ఎవరికీ లేదు.కాగా,కొందరు తాము ఆధారించే, పాటించే సంస్కృతికి వ్యతిరేకంగా దుస్తులు ధరించారని దాడులు చేయడం హేయమైన చర్య. అయితే, షార్ట్స్ వేసుకుని వచ్చినందుకు ఓ ఫ్యామిలీపై కొందరు దుండగులు దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటన పుణెలో వెలుగుచూడగా.. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

వివరాల్లోకివెళితే.. పుణే సమీపంలోని సింహగడ్ కోటలో షార్ట్స్ వేసుకుని వచ్చారని టూరిస్టులపై కొందరు వ్యక్తులు దాడులకు పాల్పడ్డారు.ఓ కంపెనీలో మేనేజర్‌గా పని చేస్తున్న వ్యక్తి(39) తన ఫ్యామిలీతో కలిసి కోటని సందర్శించడానికి వెళ్లాడు. తిరిగి వస్తున్న టైంలో ‘సమస్త్ హిందూ బంధవ్ ఆర్మీ’ అనే సంస్థకు చెందిన వ్యక్తులు వారిని అడ్డుకున్నారు. టూరిస్టుల్లో ఓ మహిళ వేసుకున్న షార్ట్స్.. 8 ఏళ్ల చిన్నారి ధరించిన పొట్టి డ్రెస్‌పై వాళ్లు అభ్యంతరం వ్యక్తం చేశారు.ఇది మన హిందూ సంస్కృతికి విరుద్ధం.. ఇలాంటి దుస్తులతో ఎలా వచ్చారంటూ వారిపై దాడికి పాల్పడినట్టు తెలిసింది.

https://x.com/pulsenewsbreak/status/2090690819703681255?s=20

బాధితుడిపై దాడి చేయడంతో పాటు అతని భార్య పట్ల కూడా అనుచితంగా ప్రవర్తించినట్టు సమాచారం. ఈ ఘటన అనంతరం బాధితులు పోలీసులను ఆశ్రయించగా.. 8 మంది దుండగులను అధికారులు అరెస్టుచేశారు. ముగ్గురు వ్యక్తులు తనపై దాడి చేయగా.. ఒక మహిళ తన భార్యను పక్కకు లాగేసిందని బాధితుడి ఫిర్యాదులో పేర్కొన్నాడు. 8 ఏళ్ల బాలిక షార్ట్స్ వేసుకోవడంపై కూడా వాళ్లు అభ్యంతరం తెలిపారని బాధితుడు వెల్లడించారు. కాగా, ఈ ఘటనలో సంకేత్ సంజయ్ పాటిల్, ఆశిష్ దిలీప్ అపర్‌తో పాటు మొత్తం 8 మందిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిసింది.

#shorts wear#tourist fammiily attacked#pune#crime
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి