National

‘బర్ల కొట్టంలో బడి..’ తనిఖీకి వెళ్లిన ‘బొద్దింక పార్టీ’ నేతలకు చుక్కెదురు!

రచన: Mamatha puppala••4 నిమిషాల పఠనం

దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల దుస్థితిని బయటపెట్టే లక్ష్యంతో ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) నేతలు వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ప్రతీ గ్రామానికి వెళ్తూ అక్కడి పాఠశాలల పరిస్థితిని పరిశీలించేందుకు ‘స్కూల్ ఠీక్ కరో’ ఉద్యమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే రాజస్థాన్‌లోని జైపూర్ జిల్లా, బగ్రూ నియోజకవర్గం పరిధిలోని రాంపూరా కన్వార్‌పురా గ్రామానికి వెళ్లిన సీజేపీ నేతలకు చుక్కెదురైంది.

కన్వార్ పురా గ్రామంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరగా ప్రస్తుతం తరగతులను ఒక గేదెల కొట్టంలో నిర్వహిస్తున్నారు. ఈ దయనీయ పరిస్థితిని పరిశీలించేందుకు వచ్చిన సీజేపీ కార్యకర్తలను గ్రామస్థులు గ్రామం వెలుపలే కట్టడి చేశారు. ప్రధాన రహదారిపై బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేసిన స్థానికులు, సీజేపీ నాయకులతో తీవ్ర వాగ్వాదానికి దిగి వారిని అక్కడి నుంచి వెనక్కి పంపివేశారు.

తమ పాఠశాల భవనాన్ని బాగుచేసుకునే సామర్థ్యం తమకుందని, ప్రభుత్వం ఇప్పటికే దీనికోసం నిధులు మంజూరు చేసిందని గ్రామస్థులు స్పష్టం చేశారు. మరోవైపు, సీజేపీ సభ్యుల తనిఖీల నేపథ్యంలో పాఠశాలల్లోకి బయటి వ్యక్తులు, మీడియా రాకుండా రాష్ట్ర విద్యాశాఖ కొన్ని ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది.

ప్రభుత్వ బడుల వాస్తవ పరిస్థితిని బయటకు రాకుండా దాచేందుకే విద్యాశాఖ మంత్రి నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారని సీజేపీ కో-కన్వీనర్ అశుతోష్ ర్యాంకా తీవ్రంగా ఆరోపించారు. ప్రభుత్వ ఆజ్ఞలకు భయపడేది లేదని, రాజస్థాన్‌లోని అన్ని పాఠశాలల దుస్థితి మారే వరకు తమ ‘స్కూల్ ఠీక్ కరో’ ప్రచారం ఆపేది లేదని ఆయన తేల్చిచెప్పారు.

#Cockroach Janata Party School Theek Karo Rajasthan#Bagru Govt School Buffalo Shed Incident#CJP Leaders Driven Out By Villagers Jaipur#Ashutosh Ranka School Theek Karo Campaign#Rajasthan Government Schools Condition News Telugu#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి