తెలంగాణ

Congress : ‘కొండా సురేఖను బర్తరఫ్ చేయాల్సిందే : సీఎల్పీ నేతలు

రచన: Kumar•••6 నిమిషాల పఠనం

అధికార కాంగ్రెస్ పార్టీలో మంత్రి కొండా సురేఖ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి మీద కొండా సురేఖ కూతురు సుస్మిత సంచలన ఆరోపణలు చేయడంతో కాంగ్రెస్ పార్టీ నేతలు భగ్గమంటున్నారు. నిన్న తన కూతురు చేసిన వ్యాఖ్యలకు తనకు సంబంధం లేదని, అవి తన వ్యక్తిగతమని మంత్రి కొండా పార్టీ క్రమశిక్షణా కమిటీ ఎదుట హాజరై వివరణ ఇచ్చింది.

అధికార కాంగ్రెస్ పార్టీలో మంత్రి కొండా సురేఖ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి మీద కొండా సురేఖ కూతురు సుస్మిత సంచలన ఆరోపణలు చేయడంతో కాంగ్రెస్ పార్టీ నేతలు భగ్గమంటున్నారు. నిన్న తన కూతురు చేసిన వ్యాఖ్యలకు తనకు సంబంధం లేదని, అవి తన వ్యక్తిగతమని మంత్రి కొండా పార్టీ క్రమశిక్షణా కమిటీ ఎదుట హాజరై వివరణ ఇచ్చింది.అయితే, మంత్రి కొండా చెప్పిన సమాధానంతో పార్టీ సంతృప్తి చెందలేదని సమాచారం.

ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కొందరు గాంధీభవన్ వేదికగా సమావేశం అయ్యారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకుని కొండా సుస్మిత చేస్తున్న విమర్శలపై పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ శాసనసభాపక్ష (CLP) వేదికగా 20 మందికి పైగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అత్యవసర ప్రెస్‌మీట్ నిర్వహించి కొండా సురేఖను వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని,పార్టీ నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు.

కూతురి వ్యాఖ్యలను ఎందుకు ఖండించలేదు : బీర్ల ఐలయ్య

‘సీఎం రేవంత్ మీద కూతురు సుస్మిత చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను మంత్రి సురేఖ ఇంతవరకు ఎందుకు ఖండించలేదు.దాన్ని మేమంతా తీవ్రంగా తప్పుబడుతున్నాం. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి కూతురి వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదనడం విడ్డూరం. పార్టీలో ఏమైనా అభిప్రాయభేదాలు ఉంటే సీఎల్పీ లేదా పీసీసీ భేటీల్లో మాట్లాడాలి. సీఎంను, పార్టీని ఉద్దేశించి బహిరంగంగా ఇలా మాట్లాడటం ఏమాత్రం సరికాదు’.

కూర్చున్న కొమ్మనే నరుకుతున్నారు : వేముల వీరేశం

‘సీఎం మీద ఎవరు తప్పుడు ఆరోపణలు చేసినా అధిష్టానం ఊరుకోవద్దు.పార్టీలోనే ఉండి సీఎం నిర్ణయాలను తప్పుబట్టడమంటే కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్టే..కూతురి వ్యాక్యలను ఖండించకపోతే ప్రతిపక్షాలకు బలం చేకూర్చినట్లు అవుతుంది.గతంలో కొండా సురేఖ నోరుజారి పార్టీకి తలవంపులు తెచ్చారు. పార్టీని అధికారంలోకి తేవడానికి రేవంత్, ఆయన సోదరులు రాత్రింబవళ్లు కష్టపడ్డారు. సీఎంకు కొండా ఫ్యామిలీ క్షమాపణ చెప్పాలి. సురేఖను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసి, పార్టీ నుంచి డిస్మిస్ చేయాల్సిందే’..

ప్రతిపక్ష నేతలా సురేఖ వ్యవహారం : బాలు నాయక్

‘సీఎం రేవంత్ మీద కొండా సుస్మిత చేసిన విమర్శలను తీవ్రంగా ఖండిస్తున్నాం. విపక్షాల కుట్రలను కొండా కుటుంబం కాంగ్రెస్‌లో ఉంటూ అమలు చేస్తున్నది.రాష్ట్రంలో ప్రజాపాలన సాగుతుంటే సురేఖ మాత్రం ప్రతిపక్ష నేతలా వ్యవహరిస్తున్నారు.సీఎంను వ్యతిరేకించే వారికి పార్టీలో కొనసాగే అర్హత లేదు.పార్టీ అధిష్టానం సురేఖపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలి’.

మంత్రి పదవిస్తే ఇదేనా మీరిచ్చే గౌరవం : నాయిని

కొండా సురేఖ నాలుగు పార్టీలు తిరిగి వచ్చారు. జిల్లాలో ఏ ఒక్క ఎమ్మెల్యేతోనైనా సఖ్యతగా ఉన్నారా? అని నాయిని రాజేందర్ రెడ్డి ఆరోపించారు. మంత్రి పదవిస్తే పార్టీకి, సీఎం‌కు మీరిచ్చే గౌరవం ఇదా? అని ప్రశ్నించారు. సురేఖ వెనుక బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఉన్నాయి.పార్టీలో నేటికీ కొన్ని గుంట నక్కలు ఉన్నాయని.. దమ్ముంటే రూ. 200 కోట్ల స్కామ్ ఎక్కడ జరిగిందో బయటపెట్టాలని సవాల్ విసిరారు.

కాగా, కొండా సురేఖను పార్టీ నుంచి డిస్మిస్ చేయాలని, మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేసిన వారిలో సీఎం రేవంత్ రెడ్డి వర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు ఉన్నారు. వారిలో నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, బీర్ల ఐలయ్య, మధుసూదన్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, దొంతి మాధవరెడ్డి, మందుల సామెల్, వెడ్మ బొజ్జు, వేముల వీరేశం, బుయ్యని మనోహర్ రెడ్డి, కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, బత్తుల లక్ష్మా రెడ్డి, బాలు నాయక్, వీర్లపల్లి శంకర్, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, చిక్కుడు వంశీకృష్ణ, బల్మూరి వెంకట్ (ఎమ్మెల్సీ), బస్వరాజు సారయ్య (ఎమ్మెల్సీ) ఉన్నారు.

#konda sureka#susmitha#cm revanth reddy#congress
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి