తెలంగాణ

Hyderabad: షాకిస్తున్న తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి ఆస్తుల చిట్టా!..

రచన: Venu•••5 నిమిషాల పఠనం

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆర్డీఓ కార్యాలయంలో తహసీల్దార్ గా విధులు నిర్వహిస్తున్న దేశాని శ్రీనివాస్ రెడ్డి నివాసాల మీద అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు చేయగా వందల కోట్ల ఆస్తులు బయటపడ్డాయి.

ప్రజలకు సేవ చేయాల్సిన ప్రభుత్వ కార్యాలయాల్లో.. కొందరు అధికారులు సంపాదనే ధ్యేయంగా లంచాలకు మరిగి వందల కోట్ల ఆస్తులు కూడబెట్టుకుంటున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.. చిన్న పని నుంచి పెద్ద ఫైల్ వరకు.. చేతులు తడపందే పని జరగదనే పరిస్థితి ప్రభుత్వ కార్యాలయాల్లో కనిపిస్తోంది. అయితే అవినీతి ఎంత దాచినా.. ఏసీబీ నిఘా నుంచి తప్పించుకోవడం అంత సులువు కాదని పలు ఘటనలు నిరూపిస్తున్నాయి.

మరోవైపు వరుసగా లంచం తీసుకుంటూ పలువురు అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడుతున్నారు. వీరి అక్రమ ఆస్తుల చిట్టా అధికారులనే ఆశ్చర్యపోయేలా చేస్తుంది. ప్రజల సొమ్ముతో జీతం తీసుకునే అధికారులు.. ప్రజలకే జవాబుదారీగా ఉండాలి. కానీ దోపిడి దారులనే మరిపించడం చర్చాంశనీయంగా మారింది. ఇక తాజాగా మరో అవినీతి తిమింగలం ఏసీబీకి నిన్న పట్టుబడిన విషయం తెలిసిందే..

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆర్డీఓ కార్యాలయంలో తహసీల్దార్ గా విధులు నిర్వహిస్తున్న దేశాని శ్రీనివాస్ రెడ్డి నివాసాల మీద అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు చేయగా వందల కోట్ల ఆస్తులు బయటపడ్డాయి. ఏకకాలంలో 15 చోట్ల ఈ రైడ్స్ నిర్వహించారు.. కాగా పట్టుబడిన ఆస్తుల విలువ అధికారిక రికార్డుల ప్రకారం రూ.6.87 కోట్లుగా ఉన్నట్టు సమాచారం.. ఇక బహిరంగ మార్కెట్లో రూ.100 కోట్ల పైన ఉంటుందని చెబుతున్నారు.

అదేవిధంగా కర్మన్ ఘాట్ లో 2.63 కోట్ల విలువైన రెండు రెసిడెన్షియల్ ప్లాట్లు, రూ.1.61 కోట్ల విలువైన జీ ప్లస్ 3 పెంట్ హౌస్ ఉన్నట్లు గుర్తించారు. వీటితో పాటు యాచారం మండలం నల్లవెల్లి గ్రామంలో రూ.25.25 లక్షల విలువ చేసే పది ఎకరాల వ్యవసాయ భూమి, నగర శివార్లలో 63.84 లక్షల విలువ చేసే ఎనిమిది ఖాళీ స్థలాలు, బాలాపూర్ లోని నరేంద్ర బార్ అండ్ రెస్టారెంట్ లో రూ.86 లక్షల పెట్టుబడులు ఉన్నట్టు గుర్తించారు..

అలాగే రూ.4 లక్షల నగదు, బ్యాంకు ఖాతాల్లో రూ.8.60 లక్షలు, 680 గ్రాముల బంగారం, రూ.59 లక్షల విలువైన మూడు కార్లు, రెండు బైకులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు శ్రీనివాస్ రెడ్డి గతంలో మహేశ్వరం, బాలాపూర్, శంషాబాద్ తదితర ప్రాంతాలలో తహసీల్దార్ గా విధులు నిర్వహించారు. అయితే మహేశ్వరం మండలంలో పనిచేస్తున్న 2009 సమయంలోనే అవినీతి నిరోధక చట్టం కింద ఒక కేసు నమోదైనట్టు సమాచారం. ఇక ప్రస్తుతం నిందితుడిని అదుపులోకి తీసుకుని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరు పరిచిన అనంతరం రిమాండ్ తరలించారు...

మరోవైపు వ్యవసాయ శాఖ అధికారి నుంచి తహసీల్దార్ వరకు.. పోలీస్ డిపార్ట్ మెంట్ నుండి కరెంట్, నీటిపారుదలతో పాటు అన్నీ ప్రభుత్వ శాఖలలో అవినీతి పాతుకుపోయిందనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే పలువురు అధికారులపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు నమోదవుతున్నాయి. ఎక్కడ చూసినా భూములు.. విల్లాలు.. ఫ్లాట్లు.. నగదు.. బంగారం.. ఇలా జీతంతో పోలిస్తే భారీగా పెరిగిన ఆస్తులు ACB దర్యాప్తులో వెలుగులోకి రావడం ఆందోళన కలిస్తున్న అంశం..

#Telangana#Hyderabad#Tahsildar#Srinivas Reddy#ABC#Illegal assets
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి