ఏపీ

viral : ఏకాంతానికి అడ్డుతగిలిన విద్యుత్ తీగలు.. అడవిలో యువజంట కేకలు

రచన: Kumar••4 నిమిషాల పఠనం

ఏకాంతంగా గడుపుదామని అడవికి వెళ్లిన ఓ జంటకు విద్యుత్ తీగలు యమపాశంలా మారాయి. నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో విద్యుత్ తీగలు మీద పడటంతో యువతి, యువకుడు తీవ్ర గాయాలపాలయ్యారు. అడవిలోనే కిందపడిపోయి లేవలేని స్థితిలో తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

ఏకాంతంగా గడుపుదామని అడవికి వెళ్లిన ఓ జంటకు విద్యుత్ తీగలు యమపాశంలా మారాయి. నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో విద్యుత్ తీగలు మీద పడటంతో యువతి, యువకుడు తీవ్ర గాయాలపాలయ్యారు. అడవిలోనే కిందపడిపోయి లేవలేని స్థితిలో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చివరకు వారి కేకలు విని అటుగా వచ్చిన గొర్రెల కాపరులు వారిని గుర్తించి ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం.

ఈ ఘటన ఏపీలోని సత్యసాయి జిల్లా కదిరి మండలం బత్తలపల్లి తండా అటవీ ప్రాంతంలో చోటుచేసుకున్నట్టు తెలిసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది. సత్యసాయి జిల్లాకు చెందిన ఫయాజ్ అనే యువకుడు.. ఓ యువతితో ప్రేమాయణం నడుపుతున్నట్టు తెలుస్తోంది. ఈ విషయం ఇరు కుటుంబాల్లో తెలియదు. సాధారణంగా అప్పుడప్పుడు బయట కలుసుకునే వీరు.. ఏకాంతంగా గడపాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.

ఈ క్రమంలోనే వీరిద్దరూ కలిసి ఏకాంతంగా గడిపేందుకు బత్తలపల్లి అటవీ ప్రాంతానికి వెళ్లారు. ఆ సమయంలో ఎవరూ వారిని గుర్తించలేదని తెలుస్తోంది. అయితే, అడవిలోకి వెళ్తుండగా.. అటవి జంతువుల కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు ఈ జంటకు తగిలినట్టు సమాచారం. దీంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయిన ఇద్దరు.. తీవ్రగాయాలతో అల్లాడిపోయారు. లేచి నిలబడేందుకు సైతం వీరి ఒంట్లో శక్తి లేదని తెలిసింది.

https://x.com/pulsenewsbreak/status/2090646584728162477?s=20

ఫలితంగా సాయం కోసం చాలా సేపు ఎదురుచూసినట్టు సమాచారం. చివరకు ఫయాజ్, సదరు యువతి పెద్దగా కేకలు వేయడంతో అటుగా వెళ్తున్న గొర్రెల కాపరులు వీరిని గుర్తించారు. జాగ్రత్తగా అక్కడి నుంచి బయటకు తీసుకొచ్చారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించగా..అక్కడకు చేరుకున్న వారు విద్యుత్ ప్రమాదంలో గాయపడిన ఫయాజ్, యువతిని అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు వారి కుటుంబసభ్యులకు ముందుగా సమాచారం అందించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిసింది.

#lovers#forest#electric shock#andrapradesh#crime
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి