National

Recharge Hike: 5G ఖర్చులన్నీ మన నెత్తినేనా? ఏడాది తిరిగేలోపే మరోసారి రీఛార్జ్ వడ్డన!

రచన: Mahesh•••4 నిమిషాల పఠనం

Recharge Hike: చేతిలో స్మార్ట్‌ఫోన్ లేనిదే పూట గడవని రోజులివి. అలాంటి సామాన్యుడి బలహీనతనే టెలికాం కంపెనీలు క్యాష్ చేసుకుంటున్నాయా? ఏడాది తిరిగేలోపే మరోసారి రీఛార్జ్ బాదుడుకు రంగం సిద్ధమైందా? అంటే టెలికాం వర్గాల నుంచి వస్తున్న సమాధానం వింటే గుండె గుభేలుమనడం ఖాయం. నవంబర్, డిసెంబర్ వచ్చేసరికి మొబైల్ రీఛార్జ్ ప్లాన్ల రేట్లు ఏకంగా 12 నుంచి 15 శాతం వరకు ఎగబాకే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

5G మాయాజాలం.. అసలు లెక్కలివే!

దేశంలో 5G రాగానే ఏదో అద్భుతం జరిగిపోతుందని కలలు చూపించారు. స్పెక్ట్రమ్ వేలం, టవర్లు, కొత్త టెక్నాలజీ అంటూ కంపెనీలు వేల కోట్లు కుమ్మరించాయి. మరి ఆ పెట్టిన ఖర్చంతా ఎక్కడి నుంచి వస్తుంది? చివరకు ఆ భారాన్ని అంతా సామాన్య మొబైల్ యూజర్ల మీదే నెట్టేయాలని డిసైడ్ అయ్యాయి. ఎయిర్‌టెల్ ఇప్పటికే పని మొదలెట్టేసింది. పోస్ట్‌పెయిడ్ ప్లాన్లపై నెలకు సైలెంట్‌గా 50 రూపాయలు పెంచేసింది. మళ్లీ దానికి కవరింగ్ ఇస్తూ.. "మేము విదేశీ రోమింగ్ ఫ్రీగా ఇస్తున్నాం కదా" అంటూ తియ్యటి కబుర్లు చెబుతోంది. వొడాఫోన్ ఐడియా కూడా సరిగ్గా ఇదే రూట్ ఫాలో అవుతోంది.

జియో నయా స్కెచ్..

మరి ఇన్నాళ్లూ ఫ్రీ ఆఫర్లతో మార్కెట్‌ను ఏలిన జియో ఏం చేస్తోంది? రీసెంట్‌గా ముంబైలో జరిగిన ఓ ఈవెంట్‌లో జియో బాస్ ఆకాశ్ అంబానీ చేసిన వ్యాఖ్యలు కాస్త ఊరటనిచ్చినట్టే కనిపించినా.. లోతుగా చూస్తే అసలు కథ వేరే ఉంది. "మేము కేవలం రీఛార్జ్ రేట్లు పెంచడం మీదే ఆధారపడటం లేదు.. కొత్త సర్వీసులు ఇచ్చి సంపాదిస్తాం" అని ఆకాశ్ చెప్పారు. బానే ఉంది, కానీ ఆ తర్వాత కంపెనీ సీఈవో పంకజ్ పవార్ అసలు విషయం బయటపెట్టారు. "అలాగని రేట్లు అసలు పెంచబోమని అనలేం.. ఆదాయం పెంచుకోవడానికి రేట్లు పెంచడం కూడా ఒక ఆప్షనే" అని తేల్చేశారు. అంటే జియో కూడా నేరుగా కాకుండా, అదనపు ఫీచర్లు ఇస్తున్నామంటూ రేట్లు పెంచే ఆలోచనలోనే ఉన్నట్లు కనిపిస్తుంది.

ఈ ఏడాది ముగిసేలోపే మన నెలవారీ మొబైల్ ఖర్చు మరింత పెరగడం దాదాపు ఖాయమైపోయింది. ఏదో ఒక సర్వీస్ ఫ్రీ అని చెప్పి జేబులోంచి అదనంగా వందల రూపాయలు లాగేసే ఈ టెలికాం కంపెనీల కొత్త ఎత్తుగడను చూసి యూజర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

#Mobile Recharge#Recharge Price Hike#5G#Jio#Airtel#Vodafone Idea#Telecom Tariff Hike#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి