Ranabaali: టాలీవుడ్లో రౌడీ హీరో ఇమేజ్ సంపాదించుకున్నాడు విజయ్ దేవరకొండ. ఆయన సినిమాలంటే ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంది. వరుసగా ఫ్లాపులు వస్తున్నా కూడా, తాజాగా వచ్చిన రణబాలి సినిమాతో హిట్ కొడతాడని అనుకున్నారు. ఈ సినిమా కథ, కథనం, హీరో పెర్ఫార్మెన్స్తో పాటు బాక్సాఫీస్ వద్ద సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందనే ఆతృతతో విజయ్ అభిమానులు ఈరోజు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు.
ఎట్టకేలకు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన పాన్ ఇండియా సినిమా ‘రణబాలి’ భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు యావరేజ్ టాక్ వినిపిస్తోంది. దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ తెరకెక్కించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య రిలీజైనప్పటికీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయిందా? అంటే అవుననే మాట వినిపిస్తోంది.
ఫస్ట్ హాఫ్ కాస్త పర్లేదు అనేలా ఉన్న రణబాలి..సెకండ్ హాఫ్ మాత్రం కొన్ని సీన్స్ బాగా ల్యాగ్ అయినట్టుగా ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి, పీరియాడిక్ సినిమా కథలు ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వాలంటే చాలా లెక్కలుంటాయి. హీరో ఇమేజ్..అప్పటి పరిస్థితులను స్క్రీన్ మీద చూపించే దర్శకుడి విజన్..క్లారిటీ..హీరోకి సూటయ్యే కథ-కథనాలు..ఇలాంటివన్నీ చాలా ముఖ్యం. ఇక, పీరియాడిక్ కథాంశం అంటే తీసుకున్న కాలాన్ని సన్నివేశాలలో సరిగ్గా చూపించగలగాలి. ఇక్కడ, హీరో ఇమేజ్ కంటే కథ మీద బాగా రీసెర్చ్ జరగాలి.
రణబాలి సినిమాకి మెయిన్ మైనస్గా మారింది సన్నివేశాల చిత్రీకరణ అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లాజిక్ లేని సన్నివేశాలు..సెకండ్ హాఫ్ లో ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిచించే సన్నివేశాలు ఉండటంతో సినిమా చూస్తున్న ప్రేక్షకులకి ఆసక్తి తగ్గిపోయిందని చెప్తున్నారు. ఈ సినిమా ఒప్పుకున్న తర్వాత దాదాపు 4 నెలల పాటు విజయ్ దేవరకొండ తీవ్రంగా శ్రమించాడు. గుర్రపు స్వారీ నేచుకున్నాడు.
కానీ, దర్శకుడు సరైన స్క్రిప్ట్ తయారు చేసుకోకపోవడంతో ఈ సినిమా కోసం విజయ్ పడ్డ రమంతా వృధా అయినట్టుగా మాట్లాడుకుంటున్నారు. విజయ్-రష్మిక ల మధ్య వచ్చే కొన్ని సీన్స్ మాత్రం ఆకట్టున్నాయంటున్నారు. మొత్తంగా, చూస్తే విజయ్ దేవరకొండ ఆశించిన సక్సెస్ దక్కడం కష్టమే. ఇక, ప్రస్తుతం విజయ్ దేవరకొండ నటిస్తున్న మరో యాక్షన్ సినిమా రౌడీ జనార్ధన మీదే ఆశలు పెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోంది. దిల్ రాజు నిర్మాత. రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్నాడు.


