సినిమా

Indian Cinema: రామాయణ-వారణాసి లలో ఏది విజువల్ వండర్‌గా నిలుస్తుంది?

రచన: Anshu••5 నిమిషాల పఠనం

Indian Cinema: రామాయణ-వారణాసి లలో ఏది విజువల్ వండర్‌గా నిలుస్తుంది? ఇప్పుడు అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలలో మాట్లాడుకుంటుంది ఈ రెండు భారీ చిత్రాల గురించే. ఇతిహాసాల నేపథ్యంలో ఎంతో గ్రాండియర్‌గా వస్తోన్న సినిమాలివి. ఇక్కడ, విశేషం ఏమిటంటే రాజమౌళి రూపొందిస్తున్న వారణాసి సినిమాతో బాలీవుడ్ ఎపిక్ మైథలాజికల్ రామాయణ సినిమాతో పోల్చుతున్నారు. ఏది విజువల్ వండర్‌గా రికార్డ్స్ క్రియేట్ చేస్తుందీ..అనేది చర్చ.

Indian Cinema: రామాయణ-వారణాసి లలో ఏది విజువల్ వండర్‌గా నిలుస్తుంది? ఇప్పుడు అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలలో మాట్లాడుకుంటుంది ఈ రెండు భారీ చిత్రాల గురించే. ఇతిహాసాల నేపథ్యంలో ఎంతో గ్రాండియర్‌గా వస్తోన్న సినిమాలివి. ఇక్కడ, విశేషం ఏమిటంటే రాజమౌళి రూపొందిస్తున్న వారణాసి సినిమాతో బాలీవుడ్ ఎపిక్ మైథలాజికల్ రామాయణ సినిమాతో పోల్చుతున్నారు. ఏది విజువల్ వండర్‌గా రికార్డ్స్ క్రియేట్ చేస్తుందీ..అనేది చర్చ.

120 దేశాలలో వారణాసి:

ఇప్పటి వరకూ అసలు ఫ్లాప్ అంటే ఏంటో తెలియని దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న సినిమా. దాదాపు 1400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. మొట్ట మొదటిసారి సూపర్ స్టార్ మహేష్ బాబు గ్లోబల్ మార్కెట్‌లో అడుగుపెడుతున్న సినిమా. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా, మలయాళ నటుడు పృథ్విరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

రాజమౌళి సినిమాకి ఉన్న క్రేజ్ రామాయణకి లేదనే చెప్పాలి. అత్యంత భారీ స్థాయిలో ఐమాక్స్ ఫార్మాట్‌లో రిలీజ్ కాబోతోంది. ఇప్పటి వరకూ ఈ సినిమా నుంచి వచ్చింది కేవలం గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్‌లో గ్లింప్స్ మాత్రమే. అలాగే, సంచారి పాట ఒకటి. కాబట్టి, ఇంకా నెగిటివ్‌గా కామెంట్స్ చేయడానికి ఏ అంశాలు కనిపించలేదు. కానీ, రామాయణ నుంచి వచ్చిన ట్రైలర్ చూసి విజువల్స్ పరంగా కొన్ని నెగిటివ్ కామెంట్స్ వినిపించాయి.

వీఎఫ్ఎక్స్ మీద చాలా నెగిటివ్ ట్రోల్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమా రెండు భాగాలను దాదాపు 4000 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి ఇందులో సీతారాములుగా నటిస్తున్నారు. సీత పాత్ర, ఆమె కాస్ట్యూంస్ గురించి ఆల్రెడీ నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. దర్శకుడు నితేష్ తివారి ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న రామాయణ పార్ట్ 1 ఈ దీపావళికి, పార్ట్ 2 వచ్చే దీపావళికి రిలీజ్ కానున్నాయి.

పార్ట్ 1 సక్సెస్ మీదే పార్ట్ 2 పై అంచనాలు, కలెక్షన్స్ ఆధారపడి ఉంటాయి. ఇది కూడా ఐమాక్స్ లో రిలీజ్ అవుతోంది. ఇక, వారణాసి ఇప్పటి వరకూ తెలిసిన అప్‌డేట్ ప్రకారం 1 పార్ట్‌గానే రూపొందుతోంది. మరి, విజువల్ వండర్‌గా రామాయణ, వారణాసి మూవీస్‌లో ఏది దేశ విదేశాలలో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ముందు నుంచి కూడా హాలీవుడ్ మేకర్స్ సైతం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంది మన జక్కన్న రూపొందిస్తున్న వారణాసి సినిమా గురించే. ఇందులో, ఎలాంటి సందేహమూ లేదు.

#Varanasi#Ramayana#SS Rajamouli#Nithesh Tiwari#Mahesh Babu#Ranbeer Kapoor
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి