NTR-Dragon: మాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న సినిమా డ్రాగన్(వర్కింగ్ టైటిల్ మాత్రమే). హీరోయిన్గా కాంతార 1 ఫేమ్ రుక్మిణి వసంత్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా తారక్ ఈ నెల 15 నుంచి షూటింగ్లో తిరిగి జాయిన్ అయ్యాడు. కానీ, ట్విస్ట్ ఏమిటంటే ఈ సినిమా విడుదల ఎంత లేదన్నా ఏడాది పోస్ట్ పోన్ కాబోతుందట.
డ్రాగన్ షూటింగ్ మొదలైనప్పటి నుంచి కొన్నాళ్ళు మాత్రమే సజావుగా సాగింది. భారీ యాక్షన్ సీక్వెన్సెస్ చిత్రీకరణ జరిపిన తర్వాత అవుట్ పుట్ బాగోలేదని తారక్ సూచనల మేరకు కొంత బ్రేక్ ఇచ్చి మళ్ళీ రీ షూట్ చేశారట. అలా కొంత ఆలస్యం, దీని తర్వాత ఎన్టీఆర్ గాయం కారణంగా మరికొన్ని నెలల పాటు ఈ సినిమా షూటింగ్‌కి బ్రేక్ పడింది.
మొత్తంగా డ్రాగన్ సినిమా 3 నుంచి నాలుగు నెలల పాటు అంతరాయం కలిగిన మాట వాస్తవం. దీని కారణంగా విడుదల తేదీ మరింత వెనక్కి వెళ్లే అవకాశం ఉందంటూ ప్రచారం మొదలైంది. దీంతో ఎన్టీఆర్ అభిమానుల్లో ఈ సినిమాపై ఆసక్తితో పాటు ఆందోళన కూడా రెట్టింపైంది. అయితే, సినిమా ఏడాది వాయిదా పడిందనే వార్తకు సంబంధించి ఒక ముఖ్యమైన విషయాన్ని మాత్రం గమనించాల్సి ఉంది.
వాస్తవానికి, ఈ పాన్-ఇండియన్ సినిమాకి ముందు ప్రకటించిన తేదీ జూన్ 11, 2026. కానీ, తాజా పరిణామాల కారణంగా విడుదల తేదీని 2027 జూన్‌కు పోస్ట్ పోన్ చేశారు. 2027, ఫిబ్రవరి వరకూ మొత్తం షూటింగ్ పూర్తి చేయాలని ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ ప్లాన్ చేస్తున్నారని తాజా సమాచారం. అగ్ర నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్, బిజు మీనన్, అశుతోష్ రాణా, కుష్బూ సుందర్, అన్షుమాన్ పుష్కర్ ఇతర కీలక పాత్రలలో కనిపిస్తున్నారు. రవి బస్రూర్ అందిస్తున్న సంగీతం డ్రాగన్ సినిమాను నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళుతుందని అంటున్నారు. ఈ భారీ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.


