క్రైమ్

HYD : హైదరాబాద్‌లో నాలుగు చోట్ల భారీ పేలుళ్లు!

రచన: Kumar••4 నిమిషాల పఠనం

హైదరాబాద్ మహానగరంలో ఇవాళ ఉదయం భారీ పేలుళ్లు సంభవించాయి. ఉన్నట్టుండి భారీ శబ్దాలు రావడంతో భయంతో జనాలు పరుగులు తీసినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో క్షతగాత్రులు, మరణాలకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు. బాంబులు పేలాయా? ఏదైనా కెమికల్ బాక్సులు పేలాయా? అనేది తెలియ రాలేదు.

హైదరాబాద్ మహానగరంలో ఇవాళ ఉదయం భారీ పేలుళ్లు సంభవించాయి. ఉన్నట్టుండి భారీ శబ్దాలు రావడంతో భయంతో జనాలు పరుగులు తీసినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో క్షతగాత్రులు, మరణాలకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు. బాంబులు పేలాయా? ఏదైనా కెమికల్ బాక్సులు పేలాయా? అనేది తెలియ రాలేదు. రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఉప్పరపల్లి, అత్తాపూర్, లంగర్‌హౌస్ ప్రాంతాల్లో పెద్ద పెద్ద శబ్దాలతో పేలుళ్లు సంభవించినట్టు సమాచారం.

ఒక్కసారిగా భారీ శబ్దాలు రావడంతో ఏం జరుగుతుందో తెలియక స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఉప్పరపల్లి, లంగర్‌హౌస్, అత్తాపూర్, రాజేంద్రనగర్, ఎర్రబోడ, కేశవస్వామి నగర్ పరిసర ప్రాంతాల్లో వరుసగా ఒకదాని తర్వాత మరొకటి పేలుడు శబ్దాలు వినిపించినట్టు స్థానికులు చెబుతున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో తీవ్ర గందగోళ వాతావరణం నెలకొంది.

వరుస పేలుళ్ల ధాటికి స్థానికంగా ఉన్న ఇళ్లలోని వస్తువులు కదిలిపోవడం, కిటికీలు డ్యామేజీ అయినట్టు తెలిసింది. భూమి ఒక్కసారిగా కంపించడంతో భూకంపం వచ్చిందా? అని స్థానికులు భయభ్రాంతులకు లోనైనట్టు సమాచారం. పిల్లలను తీసుకుని కుటుంబ సభ్యులు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసినట్టు తెలిసింది. రహదారులపై పెద్ద ఎత్తున జనం చేరుకోవడంతో ఆయా ప్రాంతాల్లో తీవ్ర గందరగోళ వాతావరణం నెలకొంది.

దీనికి సంబంధించిన సమాచారం అందుకున్న రాజేంద్రనగర్, లంగర్‌హౌస్ పోలీసులు వెంటనే అప్రమత్తమై ఘటనా స్థలాలకు చేరుకున్నారు. పేలుళ్లకు గల స్పష్టమైన కారణాలను తెలుసుకునేందుకు బాంబ్ స్క్వాడ్, క్లూస్ టీమ్‌లు రంగంలోకి దించనున్నట్టు సమాచారం. దీని వెనుక ఎవరు ఉన్నారు? బాంబ్ బ్లాస్ట్‌లకు ఎవరైనా పాల్పడ్డారా? ప్రమాదవశాత్తు జరిగాయా? గ్యాస్ లీకేజీ, క్వారీ బ్లాస్టింగ్ బాంబులు పేలాయా? ఇతర ఏవైనా కారణాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు తెలుస్తోంది.

#Blasts#hyderabad#telangana#crime#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి