సినిమా

Dil Raju: ఈ బడా నిర్మాత టార్గెట్ వాళ్ళేనా?

రచన: Anshu••4 నిమిషాల పఠనం

Dil Raju: తెలుగులో దాదాపు 10 ఏళ్ళపాటు దిల్ రాజు అటు నిర్మాతగా ఇటు డిస్ట్రిబ్యూటర్‌గా చక్రం తిప్పాడు. సురేష్ బాబు, నాగార్జున, అల్లు అరవింద్ లాంటి వారున్నా కూడా రాజు గారు..దూసుకెళ్ళారు. దాదాపు స్టార్ హీరోలందరితోను సినిమాలు ప్లాన్ చేశాడు. వాటిలో కొన్ని మాత్రమే వర్కౌట్ అయ్యాయి. సీనియర్ హీరోలతో ఇంకా సెట్ కాని ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి.

Dil Raju: తెలుగులో దాదాపు 10 ఏళ్ళపాటు దిల్ రాజు అటు నిర్మాతగా ఇటు డిస్ట్రిబ్యూటర్‌గా చక్రం తిప్పాడు. సురేష్ బాబు, నాగార్జున, అల్లు అరవింద్ లాంటి వారున్నా కూడా రాజు గారు..దూసుకెళ్ళారు. దాదాపు స్టార్ హీరోలందరితోను సినిమాలు ప్లాన్ చేశాడు. వాటిలో కొన్ని మాత్రమే వర్కౌట్ అయ్యాయి. సీనియర్ హీరోలతో ఇంకా సెట్ కాని ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. ఈలోపు మైత్రీ వారు, సితార వారు వచ్చి అడ్డుపడ్డారు. దీంతో, కాస్త స్లో అయిన దిల్ రాజు..ఇప్పుడు వీళ్లనే టార్గెట్ చేస్తూ వ్యూహాలు పన్నుతున్నట్టుగా తెలుస్తోంది.

మైత్రీతో చేతులు కలుపుతున్న స్టార్స్:

అంతకముందు, మన తెలుగు స్టార్ హీరోల డేట్స్‌ను దిల్ రాజు బ్లాక్ చేసుకునేవాడు. ఈ మధ్య ఆ ప్లాన్స్ అన్నీ మైత్రీ వారు, సితార వారు చేస్తున్నారు. అంతేకాదు, వీరు డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి అడుగుపెట్టి, దిల్ రాజును గట్టిగా టార్గెట్ చేశారు. ఇక్కడ, అందరూ చేసేది వ్యాపారమే. కానీ, ఒకరిని పైకి ఎదగకుండా చేయాలనుకుంటే పరిస్థితులన్నీ తారుమారవడం ఖాయం. ఆ మధ్య కాస్త దిల్ రాజు అలాగే ప్లాన్ చేసి పెద్ద హీరోలకి దూరం అయ్యాడనే మాట ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపించింది.

గతంలో, దిల్ రాజు..మార్కెట్ బాగా ఉన్న హీరోలకి ముందుగానే అడ్వాన్స్ ఇచ్చి డేట్స్ బ్లాక్ చేసుకునేవాడు. ఆ తర్వాత, దర్శకుడో, రచయితనో కథ చెప్తే..అది ఏ హీరోకి సూటవుతుంది..ఎవరి డేట్స్ ఉపయోగించుకోవచ్చు..అనే పక్కా ప్లాన్‌తో ప్రాజెక్ట్స్ ట్రాక్ ఎక్కించేవాడు. ఇప్పుడు, కాస్త ఆ దూకుడు తగ్గింది. అయితే, మళ్ళీ తన ఓల్డ్ స్ట్రాటజీని ఫాలో అవుతున్నట్టుగా అర్థమవుతోంది. ఎక్కువగా సినిమాల డిస్ట్రిబ్యూషన్‌లో దిల్ రాజు ప్రాపర్ ప్లానింగ్‌తో ఉంటాడు. కాస్త కథను జడ్జ్ చేయగలడు.

అందుకే, సేఫ్‌గా మళ్ళీ డిస్ట్రిబ్యూషన్‌లో దూకుడు చూపిస్తున్నాడు. ఇటీవల టాక్సిక్ తీసుకున్నాడు. ఆ సినిమా నిరాశపరిచినా..రాజుగారికి మాత్రం ఏమాత్రం నష్టం లేదు. ఇప్పుడు, రామాయణ..మైసా..నాగ చైతన్యల వృష కర్మ సినిమాలను నైజాం, ఆంధ్రాలలో పంపిణీ చేయబోతున్నాడు. వృష కర్మ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలోనూ ఆయనే డిస్ట్రిబ్యూటర్ కావడం విశేషం. ఇలా, బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లాక్ చేస్తూ మళ్ళీ రేసులోకి వస్తున్న దిల్ రాజు ఎంతవరకూ తన మేనియాను చూపిస్తాడో మరి.

#Dil Raju#Nagavamshi#Sitara#Mythri Movie Makers
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి