తెలంగాణ

TG : రేపు తీరం దాటనున్న ‘అర్నాబ్’.. తెలంగాణలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు

రచన: Kumar••4 నిమిషాల పఠనం

అర్నాబ్ తుపాన్ కారణంగా రేపు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. ప్రమాదకరమైన 'అర్నాబ్' తుపాను అక్టోబర్ 28 ఉదయానికి ఏపీలో తీరం దాటే అవకాశం ఉన్నది.

అర్నాబ్ తుపాన్ కారణంగా రేపు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. ప్రమాదకరమైన 'అర్నాబ్' తుపాను అక్టోబర్ 28 ఉదయానికి ఏపీలో తీరం దాటే అవకాశం ఉన్నది. అయితే, తీరం దాటే సమయంలో తూర్పు తెలంగాణలో (ఎరుపు రంగులో గుర్తించిన ప్రాంతాలు) భారీ నుండి అతి భారీ వర్షాలు (100-120 మి.మీ వరకు) కురిసే అవకాశం ఉంది. అలాగే, గంటకు 50-60 కి.మీ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది.

ఇక నీలం రంగులో గుర్తించిన జిల్లాల్లో అక్టోబర్ 27 రాత్రి, అక్టోబర్ 28న తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో అక్టోబర్ 28న మోస్తరు వర్షాలు (30 మి.మీ వరకు) కురిసే అవకాశం ఉన్నట్టు సమాచారం. గంటకు 40 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది.

TG :  రేపు తీరం దాటనున్న ‘అర్నాబ్’..  తెలంగాణలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు

ఇక హైదరాబాద్, నిజామాబాద్, మహబూబ్‌నగర్‌లతో సహా ఆకుపచ్చ రంగులో గుర్తించిన ఇతర జిల్లాల్లో తేలికపాటి వర్షాలు (15 మి.మీ కంటే తక్కువ) కురిసే అవకాశం ఉంది. గంటకు 35 కి.మీ వేగంతో గాలులు వీయవచ్చయని సమాచారం. అక్టోబర్ 29 తర్వాత తెలంగాణలో వర్షాలు తగ్గుముఖం పట్టవచ్చని, ఆ తర్వాత అక్టోబర్ 30 నుంచి మళ్లీ వర్షాలు పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచే సయమంలో ఎవరూ బయటకు రాకూడదని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. లేదంటే ప్రాణనష్టం సంభవించే అవకాశం ఉన్నందని వెల్లడించింది.

అర్నాబ్ తుపాను బంగాళాఖాతంలోని తూర్పు-మధ్య ప్రాంతం, దానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ ప్రాంతంలో అల్పపీడనంగా ఏర్పడగా, అక్టోబర్ 24న వాయుగుండంగా, అక్టోబర్ 25న తీవ్ర వాయుగుండంగా మారి అక్టోబర్ 26న తుపానుగా బలపడింది. ఇవాళ ఉదయం నాటికి విశాఖపట్నానికి సుమారు 650 కిలోమీటర్ల ఆగ్నేయ దిశలో, కాకినాడకు 730 కిలోమీటర్ల దూరంలో తుపాను బలంగా కదులుతోంది.అర్నబ్ తుపాను అక్టోబర్ 28 ఉదయం బాపట్ల–విశాఖపట్నం మధ్య, యానాం సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. ఆ సమయంలో గరిష్ఠంగా గంటకు 115–125 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేశారు.

#Telangana#heavy rains#cyclone arnab alert#Andrapradesh#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి