Naga Chaithanya: అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ సినిమా వృష కర్మ. కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా చడీ చప్పుడు లేకుండా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇప్పటి వరకూ ఈ సినిమా నుంచి పెద్దగా అప్డేట్స్ కూడా ఏవీ రాలేదు. తెలిసిందల్లా ఇందులో హీరోయిన్ మీనాక్షీ చౌదరీ..మిస్టిక్ థ్రిల్లర్ కథ అన్నది మాత్రమే. ఇక, ఈ సినిమాను డిసెంబర్ 4న భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. కానీ, ఇక్కడే పెద్ద సమస్య వచ్చింది. ఆ తేదీ చైతూకి సేఫ్ కాదేమో అంటున్నారు.
డిసెంబర్ 4న మరో రెండు సినిమాలు పోటీ:
తండేల్ మూవీతో భారీ హిట్ అందుకున్నాడు నాగ చైతన్య. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌తో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత బాగా గ్యాప్ వచ్చింది. ఓ రెండు మూడు నెలల్లో గనక సినిమా వచ్చి ఉంటే ఆ బజ్ ఇంకోలా ఉండేది. కానీ, దాదాపు రెండేళ్ళ గ్యాప్ తర్వాత వస్తున్న వృష కర్మ మీద ఓ మోస్తరు హైప్ ఉంది తప్ప..భారీ స్థాయిలో మాత్రం లేదనే చెప్పాలి. అయితే, ఈ సినిమా విడుదలకి ఇంకా నెలరోజులకి పైగానే ఉంది.
ఈ నెలరోజుల పాటు చిత్ర బృందం వరుసగా సినిమా నుంచి అప్డేట్స్ ఇస్తూ, ప్రమోషనల్ కంటెంట్‌తో హైప్ క్రియేట్ చేయొచ్చు. కానీ, పోటీలో ఇంకో రెండు సినిమాలున్నాయి. యూత్ స్టార్ నితిన్ నటిస్తున్న అలియాస్ రుక్మిణి కూడా అదే రోజు విడుదలకి సిద్ధమవుతోంది. చాలాకాలంగా హిట్ దక్కక ఇబ్బంది పడుతున్న నితిన్..ఈసారి తనకి బాగా సూటయ్యే కథ-కథనాలతో వస్తున్నాడు. ఈ సినిమాకి నాని సమర్పకుడు కావడం విశేషం. ముందు నుంచి కాస్త అలియాస్ రుక్మిణీ మీద బాగానే ఆసక్తి ఏర్పడింది.
మరో సినిమా లెగసి. విశ్వక్ సేన్ నటిస్తున్న సినిమా ఇది. ఈ సినిమా కూడా డిసెంబర్ 4నే రిలీజ్ చేయబోతున్నారు. యూత్ ఫుల్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న లెగసి కూడా ఆడియన్స్‌ను బాగానే హోల్డ్ చేస్తుంది. ఇలాంటి, సమయంలో నాగ చైతన్య నటిస్తున్న వృష కర్మ చిత్రాన్ని డిసెంబర్ 4న రిలీజ్ చేయాలనుకోవడం కాస్త రిస్కే అని చెప్పాలి. వాస్తవానికి, డిసెంబర్ న ప్రభాస్ ఫౌజీ రిలీజ్ కావాల్సింది. అనూహ్యంగా, ఈ సినిమా పోస్ట్ పోన్ కావడంతో వరుసగా ఈ మూడు సినిమాలు డేట్ ఫిక్స్ చేసుకున్నాయి. మరి, డిసెంబర్ 4న వచ్చే వృష కర్మ, అలియాస్ రుక్మిణి, లెగసీలలో ఏది హిట్ అవుతుందో..చూడాలి.


