స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్

TG : కాంగ్రెస్ ఖతం?

రచన: Kumar••10 నిమిషాల పఠనం

రేవంత్ రెడ్డి సర్కార్ రెండు నెలల క్రితం వరకు ఏది చేస్తున్నా ఎంతో కొంత ప్రజలకు మేలు జరుగుతుందనే ఎక్కడో ఒక్క వద్ద అందరి మదిలో మెదిలేది. కానీ, రానురాను ప్రభుత్వంలో పెరిగిపోతున్న అనధికార వ్యవస్థ, ఉద్యోగుల బరితెగింపుతో రేవంత్ ఏం చేయలేకపోతున్నారు. మాటలు వేరు. చేతలు వేరు. మళ్లీ ప్రభుత్వం రాదు. దోచుకునేవారికి దోచుకునేంతగా చేసి పెడుతున్నారు.

-కుక్కకాటుకు చెప్పుదెబ్బ అన్నట్లుగా ఏం చేద్దాం?

-అవినీతి వ్యవస్థకు మీ సెల్ ఫోన్‌యే స్పైలా సమాధానం చెప్పాల్సిన సమయం ఆసన్నమయింది

-మీరే సెల్ఫీలు తీసుకుని జరిగిన అన్యాయంపై చెప్పండి

-మీకు ఎదురైన ఇబ్బందులను స్వేచ్ఛాయుతంగా మేము ప్రచురిస్తాం

- మళ్లీ అధికారంలోకి రాలేమనే ధోరణిలో కాంగ్రెస్ నేతలు?

- ఎవరేం చేయలేరనే తీరులో ప్రభుత్వ ఉద్యోగులు?

- అందరి ధ్యాస డబ్బు పైనే.. డ్యూటీలు మర్చిపోయిన సిబ్బంది?

- రాసే ప్రతి అక్షరానికి ఆధారాలు ఉన్నాయి

- ఏం చేస్తే తెలంగాణను అవినీతి నుంచి కాపాడుకోవాలో రేవంత్ రెడ్డి చెప్పాలి?

- ఇంకో రెండేళ్లే కదా అనుకుంటూ ప్రతిపక్షాల అవలింతలు

- ఈ లోపు ఇలానే బతికేయాలా?

- చిన్న చిన్న కుటుంబాలను చిధ్రం చేసినా ఊరుకోవాలా?

- ప్రజల బాగుపై సోయి ఎలాగూ లేదు?

- ఇక నుంచైనా కనీసం ఉద్యోగులపై అయినా పట్టు సాధించండి సీఎం గారు?

- రోజురోజుకు రేవంత్ తీరు ప్రజలకు రోతలా మారుతున్న వైనంపై స్వేచ్ఛ న్యూస్ ఆధారాలతో కథనం

దేవేందర్ రెడ్డి చింతకుంట్ల

9848070809

స్వేచ్ఛ న్యూస్ చైర్మన్

మీ భ్రమలోంచి బయటకు రండి..

రేవంత్ రెడ్డి సర్కార్ రెండు నెలల క్రితం వరకు ఏది చేస్తున్నా ఎంతో కొంత ప్రజలకు మేలు జరుగుతుందనే ఎక్కడో ఒక్క వద్ద అందరి మదిలో మెదిలేది. కానీ, రానురాను ప్రభుత్వంలో పెరిగిపోతున్న అనధికార వ్యవస్థ, ఉద్యోగుల బరితెగింపుతో రేవంత్ ఏం చేయలేకపోతున్నారు. మాటలు వేరు. చేతలు వేరు. మళ్లీ ప్రభుత్వం రాదు. దోచుకునేవారికి దోచుకునేంతగా చేసి పెడుతున్నారు. ఏ పోలీస్ సిస్టమ్ పనిచేయడం లేదు. నిఘా వ్యవస్థ నిద్ర మత్తులో ఉంది. విజిలెన్స్ అధికారులు ఏం ఇస్తారు అన్నట్లుగా ఉన్నారు. ప్రభుత్వం తరుపు న్యాయవాదులు అంతకు మించిగా తప్పుడు పత్రాలు ఇస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక ఆధారాలు ఉన్నాయి. మంత్రుల చిట్టా ఉంది. మీ అనుచరుల ఆగడాలు ఉన్నాయి. ర్యాపిడో రైడ్‌తో మరింతగా మీరేంటో బోధపడింది.

ర్యాపిడో రైడర్‌ని వదిలిపెట్టడటం లేదు?

నేను చాలా సింపుల్‌గా ప్రజల్లో ఉండేలా చూస్తాను. వాళ్ల సమస్యలనే వార్తలుగా దిద్దుతాను. ఏనాడు గన్ మెన్ ఉండే అధికారులను కలవడానికి ఇష్టపడను. రోజు బస్సుల్లో తిరుగడం ఇష్టం. వీలుకు అనుకూలంగా ర్యాపిడో బుక్ చేసుకుంటాను. ఇవాళ వెంకట్ అనే రైడర్ మల్లంపేట్ ఓఆర్‌ఆర్ నుంచి మియాపూర్ వరకు తీసుకెళ్లాడు. నిత్యం ట్రాఫిక్‌లో తిరిగే అతన్ని ఎలా ఉంది అని మందలించాను. ఆదివారం జెఎన్టీయూ మెట్రో స్టేషన్ వద్ద ట్రాఫిక్ పోలీసుల దౌర్జన్యంపై బోరున ఏడ్చేంత పని చేశాడు. ‘‘నేను సైడ్‌కి సర్వీస్ రోడ్డులో సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ 20 మీటర్లు డ్రైవ్ చేశాను. ట్రాఫిక్ అతను ఆటోలో నుంచి దిగి కేసు బుక్ చేసి లోపల వేయాలా అని బెదిరించాడు. నేను ఏం తప్పు చేశానని అడిగితే ఫోన్ మాట్లాడావు, నేను చూశానని దబాయించాడు. అక్కడ నలుగురు ట్రాఫిక్ వాళ్లు ఉన్నారని చెప్పారు. నేను ర్యాపిడో నడుపుకుంటాను డబ్బులు లేవని అంటే ఎంత ఉంటే అంత క్యాష్ ఇవ్వు, లేదంటే షాపుకి వెళ్లి ఫోన్ పే చేసి డబ్బులు తీసుకొని ఆ ఆటోలో ఇచ్చి వెళ్లిపో అన్నారు. ఒపిక నసించేంత వరకు బతిలాడాను. రూ.100 ఆటో వద్ద ఇచ్చి వెళ్లిపోయాను. స్కూటీని తీసుకొని పోనివ్వకుండా ఓ కానిస్టేబుల్ కూర్చున్నాడు. సర్ నేను నాలుగు రైడ్‌లు చేస్తే వంద వస్తాయి. అలాంటి వాళ్లు సొంతంగా డబ్బులు ఇస్తే తప్పు ఒప్పు అవుతుందా? నాకు ఫైన్ వేస్తే నేను ప్రభుత్వానికైనా ఇచ్చే వాడిని. కానీ, వాళ్ల వేధింపులు మాములుగా లేవు సర్. నేను రోజు రోడ్డు మీద తిరిగే వాడిని. నన్ను వాళ్లు ఏమైనా చేయగలరు. నా వద్ద ఉన్న రూ.100 ఇచ్చి వదిలించుకున్నా’’ అని ర్యాపిడో రైడర్ అన్నాడు.

బోరు పర్మిషన్‌కి రూ.5 వేలు ఇస్తేనే?

ఎలాంటి అనుమతులు లేకుండానే రోజుకు వేల బోర్లు హైదరాబాద్‌లో వేస్తుంటారు. కానీ, ఓ కాలనీలో ఇంటికి బోరు వేసుకునేందుకు అప్లికేషన్ పెట్టుకుంటే ఎమ్మార్వో ఆఫీస్ నుంచి ఫైల్ పోయింది. జూయాలజీ డిపార్ట్మెంట్ నుంచి వ్యక్తి వచ్చి మీరు వేసుకోవచ్చు అని చెప్పారు. కానీ, 2 నెలలైనా అనుమతి ఇవ్వ లేదు. రూ.5 వేలు ఇస్తే ఇస్తామని చెప్పుతున్నారు. మా అనుమతి లేకపోతే రిపోర్టర్స్‌కి , రెవెన్యూ వాళ్లకు రూ.50 వేలు ఖర్చు అవుతాయి. మేము రూ.5 వేలే అడుతున్నామని అన్నారట.

ఎంక్వైరీ ఏదైనా రూ.10 వేలు ఇవ్వాల్సిందే?

జస్ట్ డయల్ 100కి కాల్ చేసినా వచ్చిన పోలీసులు 500 అడుగుతున్నారని ఎంతోమంది బాధితులు చెప్పారు. పాస్ పోర్టు వేరిఫికేషన్‌కి వస్తే రూ. 5 నుంచి 10 వేలు లాగేస్తున్నారు. ప్రభుత్వ ఉగ్యోగి ఎంక్సైరీ అయినా రూ. 5 వేలు ఇవ్వాల్సిందేనని పోలీసులు బరితెగిస్తున్నారు. ఇలా ఫైర్ అనుమతుల నుంచి అనేక పర్మిషన్లకు, టాస్క్ఫోర్స్, ఎస్బీ, ఎస్‌వోటీ పోలీసులు బరి తెగించి ఎక్కడెక్కడ వాటాలు రావాలో అక్కడిక్కడ లాగేస్తున్నారు.ప్రతి అక్షరానికి ఆధారం ఉంది.

రెవెన్యూలో భయం లేదు.. భక్తి లేదు.. బాధ్యత అసలే కనిపించదు?

పోలీసులను మించి రెవెన్యూ సిబ్బంది పని చేస్తున్నారు. ఆర్టీఐ అప్లికేషన్‌కి కూడా రూ. 5 వేలు ఇస్తే ఇప్పుడే ఇస్తామని అంటున్నారు. ఇక రెవెన్యూ పని ఏది ఉన్నా లక్షల్లో సమర్పించుకోవాల్సి వస్తోంది. ఆదాయం, కుల సర్టిఫికెట్స్‌లోనూ వెయ్యి రూపాయలు ఇవ్వండి, అర్హులకు చేతిలో సర్టిఫికెట్ పెట్టడం లేదు. ఏ రిజిస్ట్రేషన్ అయినా 5 వేలు ఇవ్వాల్సిందే. ఇక అక్రమం సక్రమంగా చేసి చేతులు దులుపుకుంటే లక్షలు లాగేసుకుంటున్నారు. పేదలు చెప్పులు అరిగేలా తిరుగుతున్నారు. వాళ్ల రికార్డులు వాళ్లకు తెలియకుండానే మారిపోతున్నాయి.

ఖతం అయ్యే కాంగ్రెస్ అని ఇలానే వదిలేద్దామా?

రెండేళ్లలో కాంగ్రెస్ పోతది, మళ్లీ మాదే అధికారం అని బీఆర్ఎస్, బ్యాక్ ఎండ్ వర్క్ అంతా జరుగుతోందని బీజేపీ చెప్పుకుంటూ ఈ అరాచాకాలను చూసీచూడనట్లు ఉంటున్నాయి. ఇలాంటి అక్రమాలకు మనం చెక్ పెట్టలేమా? మీ వద్ద సెల్ ఫోన్ ఉంది. దానికి కెమెరా ఉంది. ఒక ఎమ్మార్వో నువ్వు ఇంకా చావలేదా? అనే 30 సెకన్స్ వీడియో ఆ అధికారిని సస్పెండ్ చేయించింది. మిమ్మల్ని లంచం అడిగినా, దాడుల పేరుతో దౌర్జన్యం చేసినా అధికారులపై సెల్ ఫోన్‌తో స్టింగ్ ఆపరేషన్ చేయండి. భయం లేని సిబ్బందికి అన్నలు ఉన్నప్పుడే మంచిగా ఉండే అనే రోజులను తీసుకురావాల్సి ఉంది. ఇది పోరాటాల గడ్డ. తెలంగాణలోనే ప్రతి ఒక్కరూ జెన్ జీలా ఆధారాలతో అన్నీ బయట పెట్టాలి.

#Congress#end power#telangana#cm revanth reddy#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి