Mahakali-Glimpse: ఈ మధ్య కాలంలో పౌరాణిక, హిస్టారికల్ చిత్రాలొచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను అందుకుంటున్నాయి. ఫక్తు కమర్షియల్ సినిమాలనే తీయాలనుకునే దర్శకుల అభిరుచి కూడా మారిపోతోంది. రెండున్నర గంటలు ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్ళాలంటే, అది పౌరాణిక గాధనో..చారిత్మాక చిత్రమో కావాలి. అలాంటి, సినిమాలను తీస్తున్నారు మన యువ దర్శకులు. వారిలో ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఉంది ప్రశాంత్ వర్మ.
అ! సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ప్రశాంత్ వర్మ ఆ తర్వాత హను-మాన్ మూవీతో ఏకంగా పాన్ ఇండియా రేంజ్ లో హిట్ కొట్టి క్రేజీ డైరెక్టర్‌గా మారాడు. ఇక, ఒకవైపు సినిమాలు తీస్తూనే మరోవైపు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ ద్వారా భారీ చిత్రాలను అందిస్తున్నాడు. ఇప్పుడు వస్తోన్న మహాకాళి కూడా ఈ యూనివర్స్ నుంచే వస్తోంది.
ఈ ప్రతిష్టాత్మక పాన్-ఇండియా చిత్రాన్ని ఆర్కేడీ స్టూడియోస్ సమర్పిస్తుండగా, పూజా కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘శుక్రాచార్యుడి వార్ క్రై’ పేరుతో మేకర్స్ గ్లింప్స్ ని రిలీజ్ చేశారు. ఈ స్పెషల్ గ్లింప్స్ ప్రేక్షకుల్లో సినిమాపై విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇందులో బాలీవుడ్ సీనియర్ నటుడు అక్షయ్ ఖన్నా ‘శుక్రాచార్యుడు’ పాత్రలో నటిస్తుండగా, ఓజీతో మళ్ళీ లైం లైట్ లోకి వచ్చిన శ్రియా రెడ్డి ‘మహాకాళి’గా అలరించనుంది. పౌరాణిక, ఫాంటసీ మూవీగా రూపొందుతున్న మహాకాళి కేవలం గ్లింప్స్‌తోనే గూస్‌బంప్స్ తెప్పించింది.
ఇక, గింప్స్ గురించి మాట్లాడుకుంటే..అమృత మథన సమయంలో దేవతలతో కలిసి సమానంగా శ్రమించినప్పటికీ, విష్ణువు ఆ అమృతాన్ని కేవలం దేవగణానికే ప్రసాదించాడు.. ఇది ధర్మమా? అధర్మమా?’’ అంటూ అక్షయ్ ఖన్నా చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్స్ తో గ్లింప్స్ మొదలై కాసేపు కళ్ళార్పనీయదు, గెటప్, ఆయన ఎంట్రీ సీన్.. సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతుందో ఊహించుకోవచ్చు.
అక్షయ్ ఖన్నా, శ్రీయ రెడ్డి పాత్రలే సినిమాకి ప్రధాన బలం అని గ్లింప్స్ మొత్తం చూశాక అర్థమవుతోంది. ఇద్దరి మేకోవర్ కోసమే చాలా సమయం పట్టినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి, మహాకాళి సినిమాతో ఇండస్ట్రీకి మరో భారీ దక్కడం ఖాయమనుకోవచ్చు. కాగా, ఈ సినిమా 2027, ఆగస్టు 1వ తేదీన రిలీజ్ కానుంది.


