తెలంగాణ

కృష్ణా జలాల పంపకాలపై ఉత్కంఠ.. త్రిసభ్య కమిటీ భేటీలో తెలంగాణ, ఏపీ భిన్న వాదనలు!

రచన: Mamatha puppala••5 నిమిషాల పఠనం

హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్ ‘జలసౌధ’ వేదికగా కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డ్(KRMB) త్రిసభ్య కమిటీ సమావేశం ఉత్కంఠ భరితంగా ప్రారంభమైంది. కేఆర్‌ఎంబీ మెంబర్ సెక్రటరీ సతీష్ అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీకి తెలంగాణ ఇంజనీర్ ఇన్ చీఫ్ (ENC) రమేష్ బాబు, ఆంధ్రప్రదేశ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ నరసింహ మూర్తి హాజరయ్యారు.

హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్ ‘జలసౌధ’ వేదికగా కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డ్(KRMB) త్రిసభ్య కమిటీ సమావేశం ఉత్కంఠ భరితంగా ప్రారంభమైంది. కేఆర్‌ఎంబీ మెంబర్ సెక్రటరీ సతీష్ అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీకి తెలంగాణ ఇంజనీర్ ఇన్ చీఫ్ (ENC) రమేష్ బాబు, ఆంధ్రప్రదేశ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ నరసింహ మూర్తి హాజరయ్యారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటిని రెండు రాష్ట్రాల తాగునీరు, ఇతర అత్యవసర అవసరాల కోసం ఏ విధంగా పంపిణీ చేయాలనే అంశంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తున్నారు.

ఈ భేటీలో కృష్ణా జలాల కేటాయింపులపై ఇరు రాష్ట్రాల అధికారులు తమ వాదనలను గట్టిగా వినిపించారు. బేసిన్ ప్రాతిపదికన తెలంగాణకు 71శాతం వాటా ఇవ్వాలని, ఏపీకి కేవలం 29శాతం వాటా మాత్రమే వర్తిస్తుందని తెలంగాణ వాదించింది. అంతేకాకుండా, ప్రస్తుతం ఉమ్మడి జలాశయాల్లో ఉన్న నీటిలో ఏపీకి ఎలాంటి వాటా లేదని, కృష్ణా బేసిన్‌లో ప్రస్తుతం నీటి నిల్వ సదుపాయం లేనందున తాగునీటి అవసరాల కోసం ఉమ్మడి జలాశయాల్లోని నీటిని కాపాడాలని స్పష్టం చేసింది. వచ్చే ఏడాది ఆగస్టు వరకు తాగునీటి అవసరాల నిమిత్తం తెలంగాణకు 50 టీఎంసీలు (శ్రీశైలం నుంచి 10, నాగార్జునసాగర్ నుంచి 40 టీఎంసీలు) కావాలని డిమాండ్ చేసింది.

మరోవైపు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి విరుద్ధమైన ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. నీటి పంపకాలను 70:30 నిష్పత్తిలో చేపట్టాలని ఏపీ కోరింది. అక్టోబర్ 31 వరకు తాగునీటి అవసరాల కోసం 47 టీఎంసీలు విడుదల చేయాలని విజ్ఞప్తి చేసింది. తమకు కేటాయించిన 115.70 టీఎంసీల వాటా నుంచి ఈ 47 టీఎంసీలను విడుదల చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని ఏపీ కోరినట్లు సమాచారం. ఇరు రాష్ట్రాలు తమ వాటా, డిమాండ్లపై పట్టువీడకపోవడంతో కేఆర్‌ఎంబీ భేటీలో తీవ్ర చర్చ జరుగుతోంది.

శ్రీశైలం, నాగర్జున సాగర్ రిజర్వాయర్లలో పరిమిత నిల్వలు

ప్రస్తుతం శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్లలో లభ్యతలో ఉన్న పరిమిత నీటి నిల్వలు, ఇరు రాష్ట్రాల తాగునీటి అత్యవసరాల నేపథ్యంలో ఈ సమావేశం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా ఎల్ నినో ప్రభావం వల్ల భవిష్యత్తులో నీటి లభ్యతపై నెలకొన్న ఆందోళనల దృష్ట్యా, ఏ రాష్ట్రం ఎంత నీటిని వినియోగించుకోవాలనే అంశంపై బోర్డు ముందు తర్జనభర్జనలు జరుగుతున్నాయి. ఇరు రాష్ట్రాల ఇంజనీర్ ఇన్ చీఫ్‌లు తమ వాదనలకు తగిన సాంకేతిక, ఆయకట్టు అవసరాల వివరాలను కేఆర్‌ఎంబీ త్రిసభ్య కమిటీ ముందు ఉంచుతుండటంతో, ఈ సమావేశంలో తీసుకునే తాత్కాలిక సర్దుబాటు నిర్ణయాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

#Krishna River Water Sharing Dispute#KRMB Meeting Jalasoudha Hyderabad#Telangana AP Water Allocation 2026#Srisailam Nagarjuna Sagar Water Shares News Telugu#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి