తెలంగాణ

TG : పనిమనుషులుగా విద్యార్థులు.. తినాలంటే చేసుకోవాల్సిందేనా?

రచన: Kumar••4 నిమిషాల పఠనం

రాష్ట్రంలో విద్యావ్యవస్థ తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఆర్థిక స్థోమత లేక చదువు బాగా చెబుతారని ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో తమ పిల్లలను చేర్పించిన తల్లిదండ్రులు బాధపడేలా ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

రాష్ట్రంలో విద్యావ్యవస్థ తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఆర్థిక స్థోమత లేక చదువు బాగా చెబుతారని ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో తమ పిల్లలను చేర్పించిన తల్లిదండ్రులు బాధపడేలా ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారికి వడ్డించే భోజనం, ఇచ్చే దుస్తులు సరిగా ఉండటం లేదని,టీచర్లు పాఠాలు సరిగా చెప్పడం లేదని, పిల్లలతోనే అన్ని పనులు చేయించుకుంటున్నారని పెద్దఎత్తున ఆరోపణలు వస్తున్నాయి.

కొందరు టీచర్లు ఇటీవల విద్యార్థినులతో జుట్టుకు ఆయిల్ పెట్టించుకోవడం,మసాజ్ చేయించుకునే వీడియోలు బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అవికాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక గురుకులాల్లో వార్డెన్లు,ఉపాధ్యాయులు, కరస్పాండెంట్స్ పర్యవేక్షణ లేకపోవడం వలన సీనియర్ విద్యార్థులు జూనియర్లను ర్యాగింగ్ చేసిన ఘటనలూ వెలుగుచూశాయి. అదనపు చపాతి అడిగినందుకు ఓ సీనియర్.. జూనియర్‌కు పెనంతో వాత పెట్టిన విషయం గురుకులంలోనే వెలుగుచూసింది.

ఇక ఫుడ్ పాయిజన్ ఘటనల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదనుకుంట..ఈ ఏడాది అకడమిక్ ఇయర్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు 10కి పైగా ఫుడ్ పాయిజన్ ఘటనలు జరిగి విద్యార్థులు ఆస్పత్రుల పాలయ్యారు. విద్యాశాఖ సీఎం రేవంత్ రెడ్డి వద్దే ఉండటంతో ఆయనకు సమీక్షించే సమయం లేకపోవడంతో అధికారులు విద్యాశాఖను పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ఫలితంగా సాంఘీకసంక్షేమ పాఠశాలు, కస్తూర్బా పాఠశాలలు, గురుకులాల్లోని విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భోజనం బాలేక, చదువు సైతం సరిగా చెప్పడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

https://x.com/TeluguScribe/status/2091791670031606020?s=20

తాజాగా నల్గొండ జిల్లా దామరచర్ల సాంఘిక సంక్షేమ హాస్టల్‌లో విద్యార్థుల చేత ప్రిన్సిపాల్ చపాతీలు చేయించినట్టు తెలిసింది. వారిని ప్రిన్సిపాల్, వార్డెన్లు పనిమనుషులుగా మార్చినట్టు సమాచారం. ప్రభుత్వం వంట మనుషులకు జీతం ఇస్తున్నా వారితో పనిచేయించకుండా విద్యార్థుల చేతే వంట పనులు చేయించడంపై విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు భగ్గుమంటున్నారు.దీనికి సంబంధించి ఓ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. అందులో విద్యార్థులు పిండి కలుపుతూ,చపాతీలు చేస్తున్నారు.మరోవైపు నీళ్ల కర్రీలు పెడుతున్నారని విద్యార్థులు వెల్లడించారు.

#students#working#social welfare#nalgonda#telangana
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి