సినిమా

Prabhas-Spirit: అనుకున్నట్టుగా షూటింగ్ జరగడం లేదు..రిలీజ్ వాయిదానా?

రచన: Anshu••4 నిమిషాల పఠనం

Prabhas-Spirit: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతోంది స్పిరిట్. ఈ సినిమాకి సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహిస్తున్నాడు. హీరోయిన్‌గా త్రిప్తి దిమ్రీ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా గురించి వస్తున్న నెగిటివ్ న్యూస్ పై మేకర్స్ స్పదించారు. రిలీజ్ డేట్ మారుతుందని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు. ముందు చెప్పినట్టుగానే 2027, మార్చి మొదటి వారంలోనే రిలీజ్ అని కన్‌ఫర్మ్ చేశారు.

స్పిరిట్ వాయిదాకి కారణం ఫౌజీ?

కాప్ స్టోరీగా రూపొందుతోంది స్పిరిట్. ఇప్పటికే, ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్‌తోనే ఇంటర్నెట్ షేక్ అయింది. ప్రభాస్ కెరీర్‌లోనే ఇలాంటి ఇంటెన్సివ్ లుక్ ని ఏ దర్శకుడు చూపించలేదు. సందీప్ మార్క్ ఖచ్చితంగా కనిపించింది. దీంతో, సినిమాపై అంచనాలు ఊహించని విధంగా పెరిగాయి. అయితే, ఫౌజీ సినిమా కోసం ప్రభాస్ దాదాపు నెలరోజుల పాటు డేట్స్ కేటాయించాడు.

దాంతో, స్పిరిట్ షూటింగ్‌కి కాస్త బ్రేక్ పడింది. మళ్ళీ సెప్టెంబర్ నుంచి స్పిరిట్ షూటింగ్‌లో ప్రభాస్ జాయిన్ కానున్నాడు. ఈ నెలాఖరు వరకూ ఫౌజీ షూటింగ్‌ని కంప్లీట్ చేయనున్నాడు. డిసెంబర్ 3న ఫౌజీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఇప్పటికే, ఆలస్యం అయిన కారణంగా బల్క్ డేట్స్ ఫౌజీకిచ్చాడు డార్లింగ్.

అందుకే, స్పిరిట్ అనుకున్నట్టుగా మార్చి 5, 2027న రిలీజ్ కాకపోవచ్చునని..సమ్మర్‌కి షిఫ్ట్ అవొచ్చునని ప్రచారం మొదలైంది. దీనికి, తాజాగా మేకర్స్ క్లారిటీ ఇస్తూ, అనుకున్న తేదీకే ఖచ్చితంగా స్పిరిట్ వచ్చేస్తుందని డబుల్ కన్‌ఫర్మేషన్ ఇచ్చారు. దీంతో, సోషల్ మీడియాలో స్పిరిట్ సినిమా గురించి, వస్తున్న వార్తలన్నీ కేవలం గాసిప్స్ అని తేలిపోయింది. కాగా, ఈ సినిమాలో సీనియర్ నటి కాంచన, బాలీవుడ్ నటుడు వివేక్ ఓబెరాయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

#prabhas#spirit#sandeep reddy vanga#fauzi
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి